తన అనారోగ్య సమస్యని బయటపెట్టి షాకిచ్చిన యాంకర్‌ సుమ.. మేకప్‌ కష్టాలు..

Published : Oct 09, 2021, 03:37 PM ISTUpdated : Oct 09, 2021, 03:41 PM IST

స్టార్‌ హీరోయిన్లు చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలియానా, శృతి హాసన్‌, సమంత, రష్మిక మందన్నా ఇలా చాలా మంది కథానాయికలున్నారు. తాజాగా వారి జాబితాలో యాంకర్‌ సుమ కనకాల కూడా చేరారు.

PREV
16
తన అనారోగ్య సమస్యని బయటపెట్టి షాకిచ్చిన యాంకర్‌ సుమ.. మేకప్‌ కష్టాలు..

సినీ తారలకు సాధారణంగా మేకప్‌ ద్వారా కావచ్చు, శరీర ఆకృతి పరంగానూ, సర్జరీలు చేసుకోవడం వంటి కారణాల ద్వారా కావచ్చు. స్వతహాగా అనారోగ్య సమస్యలు కావచ్చు.. కారణమేదైనా వాళ్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తాను కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పి షాకిచ్చింది యాంకర్‌ సుమ కనకాల. 

26

యాంకర్‌గా సుమ కనకాల ఎంతటి పాపులరో తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి, టీవీ రంగంలోనూ ఆమె అగ్ర యాంకర్‌గా, స్టార్‌ యాంకర్‌గా రాణిస్తున్నారు. ఆమె క్షణం తీరిక లేకుండా వరుసగా షోలు, ఈవెంట్లతో బిజీగా ఉంటారు. ఏ స్టార్‌ హీరోలు, హీరోయిన్లకి మించిన బిజీగా గడుపుతుంటారు. 

36

అయితే తాజాగా యాంకర్‌ సుమ తన హెల్త్ కి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో ముచ్చటించిన ఆమె చాలా కాలంగా దాచిన విషయాన్ని బయటపెట్టింది. చాలా ఏళ్ల నుంచి తాను స్కిన్‌కి సంబంధించిన సమస్యతో బాధపడుతుందట. 

46

చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచి పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చానని, ఇక దాచాలనుకోవడం లేదని చెప్పింది. తాను కీలాయిడ్‌ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. దీని ప్రకారం ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా మారుతుంది. చిన్న గాయం కూడా పెద్దదవుతుందని, త్వరగా తగ్గిపోదని చెప్పింది. 
 

56

ఈ సమస్యని నయం చేసుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసినట్టు చెప్పింది సుమ. కానీ ఫలితం లేదని, ఈ సమస్య ఇప్పుడు తన శరీరంలో భాగమైందని చెప్పింది యాంకర్‌ సుమ. కెరీర్‌ బిగినింగ్‌లో మేకప్‌ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నట్టు తెలిపింది సుమ. 

66

సాధారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుందని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం` అంటూ వీడియోను షేర్‌ చేసింది.

also read:పిల్లల కోసం తపించిన సమంత.. చైతూతో విడాకులకు ముందు అసలు ప్లాన్‌ అదేనట.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories