Published : Dec 31, 2021, 02:51 PM ISTUpdated : Dec 31, 2021, 02:54 PM IST
శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. పర్ఫుల్ కలర్ ట్రెండీ వేర్ లో శ్రీముఖి మెరిసిపోయారు. ఆమె సూపర్ స్టైలిష్ ఫోజులు మనసులు దోచేస్తున్నాయి. దీనితో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి చోటా తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ (Anasuya), రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు.
210
అంత మాత్రాన ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో వాళ్ళకంటే వెనుక అనుకుంటే పొరపాటే. వయసులో చిన్నదైనా కానీ, తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తుంది శ్రీముఖి.
310
స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి (Sreemukhi) ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారడంతో ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
410
కామెడీ స్టార్స్ లో యాంకర్ గా చేస్తున్న శ్రీముఖి ఆ షో కోసం ట్రెండీ వేర్ లో సూపర్ గ్లామరస్ గా సిద్ధమయ్యారు. వైలెట్ కలర్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్నారు. కలువ కళ్ల్లు కవ్విస్తుంటే, మెరిసే వళ్లు మతిపోగెట్టేలా ఉంది. ఎప్పటిలాగే శ్రీముఖి ఫోటో షూట్ వైరల్ గా మారింది .
510
కాగా బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు ఆమె. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు.
610
టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి.
710
Bigg boss షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు.
810
ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది.
910
మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.
1010
నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది.