ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల దాదాపు 23 ఏళ్ళ క్రితమే టాలీవుడ్ స్టార్ హీరో జాతకాన్ని జ్యోతిష్యుడికి చూపించారట. ఆ హీరోకి సీఎం అయ్యే యోగం ఉన్నట్లు జ్యోతిష్యుడు చెప్పారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లారు. ఎందరో నటులు, నిర్మాతలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సీఎం పీఠాన్ని అధిరోహించింది ఎన్టీఆర్ మాత్రమే. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల వ్యవధిలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లో విజయం సాధించారు. ఎన్టీఆర్ తర్వాత ఇంకెవరూ టాలీవుడ్ నుంచి సీఎం కాలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
25
జూ.ఎన్టీఆర్ పై చంటి అడ్డాల కామెంట్స్
దాదాపు 23 ఏళ్ళ కిందటే ఓ జ్యోతిష్యుడు.. ప్రముఖ నిర్మాత చంటి అడ్డాలకి జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారట. నిర్మాత చంటి అడ్డాల తారక్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందే నేను బాలయ్య బాబుతో సినిమా చేసి ఉన్నాను. ఆయనకు జాతకాల మీద నమ్మకం ఎక్కువ. ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆయన జాతకాన్ని, జన్మ నక్షత్రాలని ఓ జ్యోతిష్యుడికి చూపించాను.
35
తారక్ కి సీఎం అయ్యే యోగం
ఈ కుర్రాడికి రాజకీయాల్లో మంచి యోగం ఉంది. సీఎం కూడా కావచ్చు. జాతకం చాలా బలంగా ఉంది. ధైర్యంగా సినిమా తీసేయ్ అని ఆయన నాతో చెప్పారు. ఆ విధంగా ఎన్టీఆర్ తో అల్లరి రాముడు సినిమా ప్రారంభించాం. డైరెక్టర్ బి గోపాల్ తో సినిమా అని తారక్ కి చెప్పగానే ఎగిరి గంతేసి నన్ను కౌగిలించుకున్నాడు. కానీ అల్లరి రాముడు చిత్రం ప్రేక్షకులని ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఆ సినిమా వల్ల తనకి ఎలాంటి నష్టాలు రాలేదు అని చంటి అడ్డాల తెలిపారు.
అల్లరి రాముడు చిత్రానికి ఎన్టీఆర్ కి తాను రూ.25 లక్షల పారితోషికం ఇచ్చినట్లు చంటి అడ్డాల తెలిపారు. ఆది సినిమా అప్పటికే సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ వచ్చింది.
55
రాజకీయాలకు దూరంగా..
అయితే ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అనేది తనకి తెలియదు అని చంటి అడ్డాల అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాలకొల్లులో ఆయన కోసం డోర్ టు డోర్ క్యాంపైన్ చేశాను. ఆ తర్వాత రాజకీయాలు వద్దనుకుని దూరం జరిగినట్లు చంటి అడ్డాల తెలిపారు.