అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్. సంతోషమైనా, బాధైనా అభిమానులతో పంచుకుంటుంది. నెగిటివిటీని లెక్క చేయదు. హద్దు మీరు ఎవరైనా కామెంట్స్ చేస్తే తిరిగి ఇచ్చి పడేస్తుంది. అనసూయతో పెట్టుకున్న కొందరు ఆకతాయిలు జైలుపాలు కూడా అయ్యారు.
27
Anasuya bharadwaj
అనసూయలో ఉన్న మరో లక్షణం ముక్కుసూటితనం. నిర్భయంగా తన అభిప్రాయం బయటపెట్టేస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఓటమిపాలైంది. మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన అనసూయ... తాను బీఆర్ఎస్ సపోర్టర్ అని చెప్పకనే చెప్పింది.
37
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి భయపడకుండా తన అభిప్రాయం తెలియజేసింది. అనసూయ స్ట్రెయిట్ ఫార్వర్డ్ నెస్ ఆమెకు పలుమార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయినా ఆమె తన నేచర్ మార్చుకోలేదు. ఒకరికి నచ్చినట్లు బ్రతకడం నా వల్ల కాదని చెబుతుంది. విజయ్ దేవరకొండతో ఆమె యుద్ధమే చేసింది.
47
Anasuya Bharadwaj Hot Photos
విజయ్ దేవరకొండ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులిచ్చి తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించాడని అనసూయకు తెలిసిందట. విజయ్ దేవరకొండ ప్రమేయం లేకుండా ఇది జరగదని భావించిన అనసూయ ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్స్ వేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవలకు అనసూయ ఇటీవల ఫుల్ స్టాప్ పెట్టింది.
57
Anasuya bharadwaj
తాజాగా అనసూయ ఓ పోస్ట్ పెట్టారు. 'మనం ఒకరిని దూరం పెట్టినప్పుడు. వాళ్ళు ఇతరుల వద్ద మన గురించి చెడ్డగా చెబుతారు. వాళ్ళను మాత్రం అమాయకులుగా నమ్మించే ప్రయత్నం చేస్తారు' అని కామెంట్ చేశారు. అనసూయ పోస్ట్ చూస్తే... ఆమె విభేదించిన వ్యక్తి ఎవరో తన గురించి తప్పుగా చెబుతున్నారు అనిపిస్తుంది.
67
మరి అనసూయ దూరం పెట్టిన సదరు వ్యక్తి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అనసూయ నటిగా బిజీగా ఉంది. 2023లో అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి.
77
నెక్స్ట్ ఆమె పుష్ప 2లో కనిపించనుంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.