అలీ రెజా ధృవ, వైల్డ్ గాడ్, రంగమార్తాండ చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో కూడా అలీ రెజా మెరిశాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా అలీ రెజాకి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అలీ రెజా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ వధువు. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ లో అలీ రెజా పోషించిన పాత్ర చాలా ఇంపార్టెంట్.