BrahmaMudi 13th December Episode: కావ్యని రాజ్ మోసం చేస్తున్నాడా..? అనామిక కూడా కళ్యాణ్ ని బలి చేస్తోందా?

First Published Dec 13, 2023, 10:24 AM IST

వెంటనే రుద్రాణి.. తాను చేసిన పెంట అంతా రాజ్ మాటలతో అందరూ కామ్ అయిపోయేలా ఉన్నారని భయపడుతుంది. వెంటనే.. ఇంత జరిగాక.. ఈ పెళ్లి ఎలా చేస్తారు అంటుంది.
 

Brahmamudi

BrahmaMudi 13th December Episode:రుద్రాణి వేసిన ప్లాన్ లో కావ్య బలి అయిపోతుంది. పెళ్లి శుభలేఖ కి నిప్పు అంటుకోవడంతో అందరూ కావ్యను బలిచేస్తారు. ముఖ్యంగా అనామిక తల్లి.. కావ్యపై చాలా నిందలు వేస్తుంది. దీంతో, కళ్యాణ్.. అనామిక మీద సీరియస్ అవుతాడు. ‘మీ అమ్మ మా వదినను అన్ని మాటలు అంటుంటే నువ్వు ఏమీ మాట్లాడవేంటి?’ అని అడుగుతాడు. వెంటనే రౌడీ బేబీ అప్పూ కూడా రియాక్ట్ అవుతుంది.మామూలుగానే తన అక్క కావ్యను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోదు. అలాంటిది అనామిక పేరెంట్స్ అన్ని మాటలు అనడంతో మండిపడుతుంది. ‘ ఏం మాట్లాడవేంటి అనామిక...? మొదటి నుంచి మీ పెళ్లికి సపోర్ట్ చేసిందే మా అక్క. మీ పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఇంట్లో వాళ్లను ఒప్పించింది కూడా మా అక్కే. ఆ విషయం మర్చిపోయావా?’ అని అడుగుతుంది. వెంటనే అనామిక తల్లి..‘ మాట సాయం చేసిందని గొంతు కోసుకోమంటావా? అయినా నువ్వు చిన్న పిల్లవి. ఇవి నీకు అర్థ కాదులే. అయినా ఇంత జరిగాకకూడా  ధాన్యలక్ష్మి తన కొడుకును నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందా? చూశారా,. ఆవిడ మౌనమే సమాధానం చెబుతుంది’అని అంటుంది.

Brahmamudi

అప్పుడు రాజ్ కలగజేసుకుంటాడు. ‘ మా పిన్ని, ఈ పెళ్లి చేయాలా వద్దా అని ఆలోచించడం లేదు. మీరు కళావతిపై వేస్తున్న నిందలకు బాధపడుతోంది. ఎందుకంటే, ఆ ఇంట్లో అందరూ కళావతిని అంతగా నమ్ముతారు కాబట్టి. ఎవరు విషయంలో ఎలా ఉన్నా, తన మరిది విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంది. తన జీవితం బాగుండాలని కోరుకుంటుంది. అలాంటిది ఇలా ఎలా చేస్తుందని అనుకుంటారు..?’ అని రాజ్ అంటాడు. వెంటనే రుద్రాణి.. తాను చేసిన పెంట అంతా రాజ్ మాటలతో అందరూ కామ్ అయిపోయేలా ఉన్నారని భయపడుతుంది. వెంటనే.. ఇంత జరిగాక.. ఈ పెళ్లి ఎలా చేస్తారు అంటుంది.

‘ చేసుకుంటే తప్పేంటి అత్తా..? ఒక పెళ్లి పత్రిక కాలిపోయిందని కారణం చూపించి, ఒక ఆడపిల్ల ఎవరిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ ఛేస్తారా? అదే జరిగితే, సమాజం మన కుటుంబం గురించి ఏమనుకుంటుంది..? చూడండి.. ఏం జరిగినా సరే, ఈ అమ్మాయికీ, మా తమ్ముడికి పెళ్లి జరుగుతుంది. ఇలాంటి కారణాలు  చూపించి, మీ అమ్మాయి కోడలిగా వచ్చాక ఎవరూ తక్కువ చేసి చూడరు. అంత సంస్కార హీనులు ఎవరూ లేరు ఇక్కడ. ఈ విషయం మర్చిపోయి.. పెళ్లి పనులు మొదలుపెట్టండి’ అని రాజ్ అంటాడు. రాజ్ మాటలకు వాళ్ల తాతయ్య సీతారామయ్య కూడా సై అంటాడు. తర్వాత రాజ్ .. కావ్యను అందరికీ టీ తీసుకురమ్మని చెబుతాడు. అపర్ణ ఏదో మాట్లాడబోతుంటే, రాజ్ కి శ్వేత ఫోన్ చేస్తుంది. శ్వేత ఫోన్ తో వెంటనే రాజ్ బయటకు పరుగులు తీస్తాడు.
 

Latest Videos


Brahmamudi

అయితే, సడెన్ గా పెళ్లి పత్రిక ఎలా తగలపడిందా అని కావ్య ఆలోచిస్తూఉంటుంది. రుద్రాణి వచ్చి.. సగం పెళ్లి పత్రిక కాల్చేశావ్ అని దానిని లాక్కుంటుంది. వెంటనే, కావ్య.. సెటైర్ వేసి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రాహుల్ వచ్చి నీ ప్లాన్ అంతా రాజ్ తుస్సుమనిపించాడుగా అంటాడు. దానికి ఇగో హర్ట్ అయిన రుద్రాణి.. తనను రెచ్చగొడితే ఏం జరుగుతందో చూపిస్తానని, కావ్య చేతుల మీదగానే ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది.

Brahmamudi

తర్వాత కావ్య కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటే కనకం వస్తుంది.ఆ శుభలేఖ టాపిక్ తీసుకువస్తుంది. ‘నీ వల్ల పెళ్లి ఆగిపోయి ఉంటే, నీ అత్త, స్వప్న వాళ్ల అత్త మనల్ని ఎన్ని మాటలు అనేవారో, మొత్తం కుటుంబాన్ని తిట్టేవారు’అని కనకం అంటుంది. ‘ మా ఆయన ఊరుకోరు కదా’ అని కావ్య సంబరంగా చెబుతుంది. కనకం మనసులో ఊరుకొని ఉంటే, పెళ్లి ఆగిపోయేది అనుకొని, బయటకు మాత్రం  తన అల్లుడు శ్రీరామ చంద్రుడు అని చెబుతుంది. సరిగ్గా వీళ్లు రాజ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే, మరోవైపు రాజ్ శ్వేతను కలవడానికి వెళ్లిన విజువల్స్ చూపిస్తారు.

Brahmamudi

అప్పుడే శ్వేత వచ్చి రాజ్ కళ్లు మూస్తుంది. తర్వాత హగ్ కూడా చేసుకుంటుంది. ఎలా ఉన్నావ్ శ్వేత అని రాజ్ అడిగితే.. ‘నేను అలానే ఉన్నాను, నా మనసు అలానే ఉంది. నా ప్రేమ అలానే ఉంది’ అంటుంది. మరోవైపు కావ్య.. రాజ్ గురించి చాలా గొప్పగా చెబుతుంది. ఇక్కడ శ్వేతతో రాజ్ చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా సింక్ చేసి చూపించడంలో ఏదో అర్థం ఉండే ఉంటుంది. రాజ్ రాముడు, గొప్పోడు అని వీళ్లు అనుకుంటుంటే, ఇటు రాజ్.. శ్వేత చేతిలో చెయ్యి వేసుకొని నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు.

Brahmamudi

మరోవైపు కళ్యాణ్ బాధగా కూర్చొని ఉంటాడు. కావ్య జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తుంది.  పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తోందని, జాతకం దోషం వల్లే శుభలేఖ కాలిపోయిందా అని  కళ్యాణ్ అంటాడు. కానీ, కావ్య సముదాయిస్తుంది. మనం ఎలాంటి మోసం చేయలేదని, జస్ట్ ఒక నిజం దాచిపెట్టామని చెబుతుంది. అంతేకాదు.. తాము జాతకాలు కూడా కలవలేదు కదా.. మేము సంతోషంగానే ఉన్నాం కదా అని చెబుతుంది. అప్పుడే ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి వస్తారు. ఏం గూడుపుటానీ చేస్తున్నారు అని సరదాగా అడుగుతారు.  కావ్య టాపిక్  మార్చడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి.. కళ్యాణ్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేద్దాం అని అంటాడు. తర్వాత శుభలేఖ కాలిపోయిందని బాధపడుతున్నాడని చెబుతుంది.

Brahmamudi

దీంతో, ఇందిరాదేవి.. కార్తీక దీపాలు కోనేటిలో వదిలిపెడితే, దోషాలన్నీ తొలగిపోతాయని, ఎలాంటి భయం అవసరం లేదని ధైర్యం చెబుతుంది. మరోవైపు అనామిక తన పేరెంట్స్ తో కలిసి మాట్లాడుతుంది. పెళ్లి ఎక్కడ ఆగిపోతుందా అని అనామిక టెన్షన్ పడితే, ఏం కాదని వాళ్ల నాన్న చెబుతూ ఉంటాడు. తర్వాత కళ్యాణ్ ఫోన్ చేసి, కార్తీక పౌర్ణమి గురించి, ఉపవాసం గురించి చెబుతాడు. తర్వాత ఇదే విషయాన్ని అనామిక తన పేరెంట్స్ కి చెబుతుంది. వాళ్ల ఇంట్లో వాళ్లు ఎవరూ  పెళ్లి పత్రిక గురించి పట్టించుకోవడం లేదని చెబుతుంది.

Brahmamudi

తర్వాత అనామిక తండ్రి..పెద్ద ప్లాన్ వేస్తాడు. కళ్యాణ్ తోపాటు, వాళ్ల కుటుంబాన్ని నమ్మించడానికి ఉపవాసం ప్లాన్ వేయమని సలహా ఇస్తాడు. ఉపవాసం చేయకపోయినా, ఉన్నట్లు నటించమని  సలహా ఇస్తాడు. తండ్రి, కూతుళ్లు ఆస్తి కోసం పెద్ద ప్లాన్ వేస్తారు. 

Brahmamudi

మరోవైపు అప్పూ ఇంట్లో ఒంటరిగా కూర్చొని.. కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.  కళ్యాణ్ తనతో ఉన్న రోజులు తలుచుకుంటుంది. ఆ తర్వాత..  కనకం ఎవరూ లేని ప్లేస్ లో కూర్చొని అప్పూకి ఫోన్ చేస్తుంది. రేపుకార్తీక పౌర్ణమి అని,  ఉపవాసం ఉండి, రేపు దీపాలు వెలిగించమని చెబుతుంది. మొదట అప్పూ కాదు అంటుంది. కనకం ఎమోషనల్ డైలాగులు కొట్టడంతో సరే అంటుంది.

click me!