అప్పుడు తులసి,హనీ దగ్గరికి వెళ్తుంది. తర్వాత నందు,పరంధామయ్య నీ పలకరించగా,పరంధామయ్య తిరిగి మాట్లాడడు.నేను పలకరించిన మాట్లాడలేనంత తప్పు ఏం చేసాను నాన్న అని అనగా, వయసు అయిపోతుంది కదా అని చెప్పి నా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటాను అనుకోవద్దు అని అంటాడు పరంధామయ్య. ఇంతలో లాస్య, పూర్వ నాటకాల్లో ఇద్దరు కృష్ణులు ఉండేవారు. ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరు. ఇప్పుడు మొదటి కృష్ణుడు అయిపోయాడు కదా, రెండో కృష్ణుడు ఇంటికి త్వరలోనే వస్తాడు అని అంటుంది. దానికి అనసూయక కోపం వచ్చి,నీ మనసులో అనుకుంటుందే బయటికి అవుతాది అని కలలు కనొద్దు లాస్య.