కానీ మహేంద్ర మాట్లాడడానికి సమయం ఇవ్వడు. మహేంద్ర కాఫీ తాగి వెళ్దాం అనగా జగతి వద్దంటుంది కానీ రిషి వచ్చేసరికి మహేంద్ర జగతిని తీసుకొని బయటకు వెళ్తాడు. అప్పుడు జగతి,రిషి మహీంద్రా తో ఎదో మాట్లాడాలనుకుంటున్నాడు అని పసిగట్టి, నాకు చిన్న పని ఉన్నది మహేంద్ర అని వెళ్ళిపోతుంది.అప్పుడు రిషి,మేడం కి న మనసులో మాట అర్థమైందా లేక నిజంగానే పనున్నదా అని అనుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర, రిషిలు ఇద్దరు బయటకొచ్చి ఆగుతారు. అప్పుడు రిషి మనసులో, పెద్దమ్మ కి చెప్పించినందుకు ఇలా ఉన్నారేమో అని అనుకుంటాడు. దానికి మహేంద్ర నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకుంటున్నావా రిషి.నేను నిన్న సారి అడిగినందుకు ఏం బాధపడడం లేదు. నీకోసం, కేవలం నీ ఆనందం కోసమే నిన్న అలా చేశాను. నీ ఆనందం కోసం ఒకటి కాదు వంద సార్లు సారీ చెప్పమన్నాను నేను వెనకాడను అని అంటాడు. అప్పుడు రిషి,డాడ్ నాకు చిన్నప్పటినుంచి మీరు ఏమి అడిగినా ఇచ్చారు.