Anasuya: తమన్నా కన్నా అనసూయ దారుణం, నిర్వాహకులకు తలబొప్పి

Published : Nov 09, 2021, 02:07 PM ISTUpdated : Nov 09, 2021, 02:29 PM IST

స్టార్ యాంకర్ అనసూయ (Anasuya) రంగంలోకి దిగినా ప్రయోజనం లేదు. ఫలితం తమన్నా ఇచ్చిన దానికంటే దారుణం. ఏమీ చేయాలో తెలియకు తలలు పట్టుకుంటున్న నిర్వాహకులు.   

PREV
16
Anasuya: తమన్నా కన్నా అనసూయ దారుణం, నిర్వాహకులకు తలబొప్పి

స్టార్స్ వ్యాఖ్యాతలుగా అనేక బుల్లితెర ప్రోగ్రామ్స్ సూపర్ హిట్. ఆ స్పూర్తితో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) వ్యాఖ్యాతగా మాస్టర్ చెప్ పేరుతో ప్రముఖ ఛానల్ లో వంటల ప్రోగ్రాం మొదలైంది. టాప్ చెఫ్స్ న్యాయనిర్ణేతలుగా, గ్రాండ్ గా లాంచ్ చేశారు.

26

 
షో ఖచ్చితంగా హిట్ కొడుతుందన్న నమ్మకంతో తమన్నాకు మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. కాంప్రమైజ్ కాకుండా రూపొందించిన మాస్టర్ చెఫ్ షో అట్టర్ ప్లాప్ అయ్యింది. మొదట్లో బాగానే టీఆర్పీ రాబట్టిన ఈ ప్రోగ్రాం క్రమేణా.. దారుణంగా పడిపోయింది. దీనితో నిర్వాహకులు ప్రత్యమ్నాయ చర్యలపై ద్రుష్టి పెట్టారు. 

36


యాంకర్ గా తమన్నాను తొలగించి, అనసూయను రంగంలోకి దించారు. ఈ నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, తమన్నా లీగల్ ఫైట్ మొదలుపెట్టారు. మరోవైపు తమన్నా వలన రూ. 5 కోట్ల నష్టం ఏర్పడిందని, నిర్వాహకులు కౌంటర్ కామెంట్స్ చేశారు. దీనితో ఈ షో చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 

46

ఇక అనసూయ ఎంట్రీతో టీఆర్పీ గాడిన పడుతుందని ఆశించిన నిర్వాహకులకు నిరాశే ఎదురైంది. తాజా గణాంకాలు చూస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అనసూయతో టీఆర్పీ పెరగకపోగా, మరింతగా పడిపోయింది. దీనితో ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి ఏర్పడింది.

56

అయితే అనసూయ ఈ షో బాధ్యతలు తీసుకుని కొద్దివారాలే అవుతుంది. భవిష్యత్ లో మెల్లగా పుంజుకునే అవకాశం లేకపోలేదని గట్టి నమ్మకంతో ఉన్నారట. గతంలో అనసూయ ఒంటి చేత్తో కొన్ని షోల టీఆర్పీ అమాంతంగా పెంచిన ట్రాక్ ఉండగా, ఆమెనే నమ్ముకున్నారు.

66

 
మరోవైపు అనసూయ వెండితెర ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమె తెలుగు, తమిళ, మలయాళ బాషలలో ఆఫర్స్ దక్కించుకుంటూ జోరు చూపిస్తున్నారు. తెలుగులో అనసూయ నటించిన రంగమార్తాండ, ఖిలాడి, పుష్ప (Pushpa) వంటి చిత్రాలు క్రేజీ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.  

 

Also read Anasuya Baradwaj : సాంప్రదాయానికి చీరకడితే ఇలానే ఉంటుందేమో.. హాట్‌ యాంకర్‌ అనసూయ దీపావళి స్పెషల్‌ ఫోటోలు

Also read అనసూయ బెల్లీ షో, మరీ ఇంత హాటా.. నడుము అందాలతో రెచ్చిపోయిన హాట్ యాంకర్

Read more Photos on
click me!

Recommended Stories