Trolling: 90 ఏసినట్టున్నాడు.. బాలీవుడ్‌ యాక్టర్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

First Published | Nov 8, 2021, 6:36 PM IST

ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్‌ లు మాత్రమే ఆయన వాడుతున్నారు. ట్విట్టర్‌లో ప్రభాస్‌కి అకౌంట్ లేదు. అయితే ఈ విషయం తెలియక ఓ బాలీవుడ్‌ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు. ప్రభాస్‌ ఫ్యాన్స్ ఆగ్రహానికి బలయ్యాడు. ఇప్పుడు దారుణంగా ట్రోల్‌ అవుతున్నాడు. 
 

ప్రభాస్‌(Prabhas) పాన్‌ ఇండియా స్టార్. ప్రస్తుతం ఐదు పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ ఆయన సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరు. ఆయనకు సంబంధించిన పోస్ట్ లను కేవలం సెలక్టీవ్‌గా మాత్రమే తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్‌ లు మాత్రమే ఆయన వాడుతున్నారు. ట్విట్టర్‌లో ప్రభాస్‌కి అకౌంట్ లేదు. అయితే ఈ విషయం తెలియక ఓ బాలీవుడ్‌ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు. Prabhas ఫ్యాన్స్ ఆగ్రహానికి బలయ్యాడు. ఇప్పుడు దారుణంగా ట్రోల్‌ అవుతున్నాడు. 

ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న చిత్రమిది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్నారు. సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా బాలీవుడ్‌ నటుడు సన్నీ సింగ్‌(Sunny Singh) నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రభాస్‌ తన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నాడు. 
 


ఈ నేపథ్యంలో ఆదివారం సన్నీసింగ్‌ ప్రభాస్‌తో దిగిన ఫోటోని పంచుకున్నారు. ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ పెద్దన్నతో వర్క్ చేయడం వల్ల తన ఆలోచన మారిందని, తన పంథా మారిందని వెల్లడిస్తూ ప్రభాస్ కి ధన్యవాదాలు తెలిపారు సన్నీ సింగ్‌. ఈ సందర్భంగా `యాక్టర్‌ ప్రభాస్‌` అనే ఐడీని ట్యాగ్‌ చేశారు Sunny Singh. ఇక్కడే బుక్కయ్యాడు సన్నీసింగ్‌. 

`ఆదిపురుష్‌`లో లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్న సన్నీ సింగ్‌ ప్రభాస్‌ ట్వీట్‌ని ట్యాగ్‌ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రభాస్‌ ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ కేవలం ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లు మాత్రమే వాడతారని, ట్విట్టర్‌ వాడరని, కనీసం ఈ విషయం కూడా తెలుసుకోకుండా ఉంటారా ? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో సన్నీ సింగ్‌ని మీమ్స్ తో ఆడుకుంటున్నారు. 
 

`90 ఏసుకుని పోస్ట్ చేశాడేమో` ఒకరు కామెంట్‌ చేస్తే, ఆ మాత్రం కూడా తెలియదా? అది ఓ పాన్‌ ఇండియాస్టార్‌ని ట్యాగ్‌ చేసేటప్పుడు కనీసం తెలుసుకోవాలి కదా. ఇంత నిర్లక్ష్యం ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు. సన్నీ సింగ్‌ని ట్రోల్‌ చేస్తూ వైరల్‌గా మార్చేశారు. దీంతో ఇప్పుడు సన్నీసింగ్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది.  prabhas, sunny singh.

టీవీ నటుడిగా తెరకి పరిచయం అయిన సన్నీ సింగ్‌ 2013లో `ఆకాష్‌ వాణి` చిత్రంతో బాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత `ప్యార్‌ కా పంచ్‌నామా2`, `సోనూ కే టీటు కి స్వీటీ`, `జూతా కహిన్‌ కా`, `ఉడ్తా చమన్‌`, `జై మమ్మీ డీ` చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం `ఆదిపురుష్‌`లో లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 11కి విడుదల కానుంది.

Latest Videos

click me!