ఈరోజు ఎపిసోడ్లో అనసూయ పరందామయ్యని నిందిస్తూ నన్ను నోరు మూసుకొని ఇంటికి వెళ్ళమంటారా అని అనగా వెంటనే పరందామయ్య నువ్వు చేసిన దానికి నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను తెలుసా నా మౌనం అని అంటాడు. నీ నాలుక మీద ఒక విషపురుగు ఉంటుంది అది ఎప్పుడు సఖ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేలా చేస్తుంది అని అంటాడు పరంధామయ్య. ఎన్ని చేసిన ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా నిశ్శబ్దంగా భరించాను. ఎంతోమంది నన్ను నోరులేని మొగుడు అంటూ ఎగతాళి చేసేవారు అని బాధపడతాడు పరంధామయ్య. ఆ జనానికి నువ్వు చేసే మంచి పనులు తెలియక నన్ను వెటకారంగా మాట్లాడించాడు అని అంటాడు పరంధామయ్య. ఇప్పటివరకు నువ్వు ఏం చేసినా భరించాను.