`ప్రాజెక్ట్ కే`పై నాగ్‌ అశ్విన్‌ షాకింగ్‌ కామెంట్స్.. అవి `మహానటి`లా కిరాయికి తేలేమంటూ స్పష్టం..

Published : Nov 19, 2022, 09:25 AM ISTUpdated : Nov 19, 2022, 11:44 AM IST

`మహానటి` వంటి అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు ప్రభాస్‌తో పాన్‌ వరల్డ్ మూవీ `ప్రాజెక్ట్ కే` చేస్తున్నారు. తాజాగా దీనిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.   

PREV
15
 `ప్రాజెక్ట్ కే`పై నాగ్‌ అశ్విన్‌ షాకింగ్‌ కామెంట్స్..  అవి `మహానటి`లా కిరాయికి తేలేమంటూ స్పష్టం..

ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో `ప్రాజెక్ట్ కే`(Project K) ఒకటి. `మహానటి` ఫేమ్‌ నాగ్ అశ్విన్‌ దీన్ని సైన్స్ ఫిక్షన్‌గా, ఓ విజువల్‌ వండర్‌గా తెరకెక్కించబోతున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది పాన్‌ ఇండియా చిత్రం కాదని, పాన్‌ వరల్డ్ మూవీ అని, అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో సినిమా ఉండబోతుందని దర్శకుడు చెప్పిన విషయం తెలిసిందే. సుమారు 500కోట్ల బడ్జెట్‌తో అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు.
 

25

అందుకు తగ్గట్టే దీపికా పదుకొనె కథానాయికగా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్‌ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి అప్‌ డేట్‌ రాలేదు. ఆ మధ్య నిర్మాత అశ్వినీదత్‌ మాట్లాడుతూ, సమ్మర్‌లోగానీ, దసరాకిగానీ సినిమాని విడుదల చేస్తామని తెలిపారు. ప్రభాస్‌ అనారోగ్యం విషయంలో కాస్త ఆలస్యమవుతుందని కూడా పేర్కొన్నారు. 

35

కానీ సినిమా ఏ స్టేజ్‌లో ఉంది, ఏం జరుగుతుందనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌ లాంటి అప్‌డేట్లు లేవు. ప్రభాస్‌ అభిమానులు ఆశించి ఆశించి నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఏంటని దర్శకుడిని ప్రశ్నించగా ఆయన షాకింగ్‌ కామెంట్లు చేశారు. `మహానటి`లా కిరాయికి తేలేమని ప్రతిదీ సృష్టించుకోవాలని, తయారు చేసుకోవాలని, అందుకే టైమ్‌ పడుతుందని పేర్కొన్నారు. 
 

45

నాగ్‌ అశ్విన్‌ `ప్రాజెక్ట్ కే` పై స్పందిస్తూ, సినిమా కొత్తది, స్క్రిప్ట్ కొత్తది, బిల్డప్‌ చేసే ప్రపంచం కొత్తది. ఓ రకంగా సినిమా ఎలా చేయాలనేదానికే టైమ్‌ పడుతుంది. అన్ని తయారు చేయాలి. కొంత స్క్రాచ్‌. ఇప్పుడు `మహానటి` లో కార్లు కావాలంటే వెళ్లి రెంట్‌కి తీసుకోవచ్చు. రొజుకి ఇంత అని చెప్పి కిరాయికీ తీసుకోవచ్చు. కానీ `ప్రాజెక్ట్ కే`కి వెహికిల్స్ కావాలంటే లేవు. వాటిని తయారు చేసుకోవాలి. ఎక్కడా దొరకవు. అందుకే టైమ్‌ పడుతుంది. సినిమా కూడా కచ్చితంగా కొత్తగా ఉంటుంది` అని తెలిపారు నాగ్‌ అశ్విన్‌. 
 

55

ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఈ వ్యాఖ్యల ఆడియో ఫైల్‌ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సంచలనాలు క్రియేట్‌ చేస్తూ, అభిమానులకు షాకిస్తుంది. ఈ లెక్కన ప్రాజెక్ట్ కే పూర్తి కావడం ఇప్పట్లో అయ్యే పని కాదని, రిలీజ్ కూడా వచ్చే ఏడాదికష్టమే అని, 2024లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు అప్ డేట్లు ఇవ్వడం కూడా సాధ్యం కాదనే విషయాన్ని నాగ్‌ అశ్విన్‌ మాటలను బట్టి స్పష్టమవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories