తెలుగులో అత్యంత పాపులర్ అయిన బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ టాప్ లో ఉంటుంది. జబర్దస్త్ షో వల్లే బలగం వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి టాలెంటెడ్ కమెడియన్లు పాపులర్ అయ్యారు. అదేవిధంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది లాంటి వాళ్లు కూడా మంచి గుర్తింపు పొందారు.
జబర్దస్త్ షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ కి నాగబాబు అతిథిగా హాజరవుతున్నారు. చాలా ఏళ్లపాటు నాగబాబు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ షోకి అనసూయ కూడా హాజరు కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ మెగా సెలబ్రేషన్స్ ఎపిసోడ్ ఆగస్టు 1న ప్రసారం కాబోతోంది.