శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. తన ఏజ్ గురించి ట్రోల్ చేస్తున్న వారికి అనసూయ కౌంటర్ ఇచ్చింది. అనసూయ ఏం చెప్పిందో ఈ కథనంలో తెలుసుకోండి.
ప్రముఖ నటుడు శివాజీ ఇటీవల చేసిన సామాన్లు కామెంట్ ఎంత పెద్ద వివాదంగా మారిందో తెలిసిందే. అనసూయ, చిన్మయి మరికొందరు నటీమణులు శివాజీకి కౌంటర్ ఇచ్చారు. అనసూయ సెటైరికల్ గా శివాజీకి కౌంటర్ ఇవ్వడం చూశాం. కొందరు అనసూయకి సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.
25
ఆ భయం వల్లే ఇలా చేస్తున్నారు
కొంతమంది పురుషులు, మరికొంత మంది మహిళలు కూడా నా ఏజ్ ని ఉపయోగించి నన్ను తక్కువగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన ఆలోచనలు కలిగిన వారు ప్రగతిశీల మహిళలని లక్ష్యంగా చేసుకుంటారు. మహిళలపై నియంత్రణ కోల్పోతామనే భయం వల్ల ఇలా చేస్తున్నారు. నేను మహిళలు, పురుషులు అందరికీ ఒక విన్నపం చేస్తున్నా. దయచేసి విస్తృతంగా ఆలోచించండి. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటు పడ్డ విషయాలని మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం మార్పుని ఎంచుకోవచ్చు పేర్కొంది.
35
ఆంటీ అంటూ ట్రోలింగ్
మరో ట్వీట్ లో తనని ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చింది. కొందరు పురుషులు, మహిళలు ఉన్న సమస్య గురించి మాట్లాడడం చేతకాక నన్ను ఆంటీ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారు. కానీ ఆయన్ని మాత్రం గారు అంటున్నారు. నేనేం మోసం చేయను.
నా ఏజ్ 40.. ఆయన ఏజ్ 54 అనుకుంటా. అయినా మేమిద్దరం మా వృత్తి కోసం చక్కగా ఫిట్నెస్, గ్లామర్ మైంటైన్ చేస్తున్నాం. అయినా ఈ అనేవాళ్ళు అంతా నిత్య యవ్వనులు అనుకోండి అది వేరే విషయం అంటూ అనసూయ సెటైర్లు వేసింది.
55
అనసూయ సినిమాలు
ఇక సినిమాల విషయానికి వస్తే శివాజీ తాజాగా దండోరా అనే చిత్రంలో నటించారు. అనసూయ చివరగా హరిహర వీరమల్లు అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. అనసూయ క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలతో నటిగా పాపులారిటీ పొందింది.