Intinti Gruhalakshmi: లాస్య మీద కోపంతో రగిలిపోతున్న అనసూయ.. తులసికి మరొక సర్ప్రైజ్ ఇచ్చిన సామ్రాట్?

First Published Dec 19, 2022, 11:20 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో తులసి చాలా ఏళ్ల తర్వాత కలిసాము. సంతోషంగా ఉన్నాము ఈ సమయంలో నా కథ చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అనిపించింది అందుకే చెప్పలేకపోయాను అని అంటుంది తులసి. అందుకే నేను ఏం మాట్లాడలేకపోయాను మీరు ఏమీ అనుకోకండి అనడంతో నేనేమీ అనుకోలేదు మీరేం బాధపడకండి అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి విడాకులు తీసుకున్నవాడ వారికే ఇలాంటి అవమానాలు అన్నీ మగవారు మాత్రం ఎంజాయ్ గా తిరుగుతూ ఉంటారు అని బాధపడుతుండగా వెంటనే ఏదో సంతోషంగా ఉండడం కోసం ఈ ఊరికి వచ్చారు దానిని పాడు చేసుకోకండి అని అంటాడు.

 మరొకవైపు అనసూయ పరంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి శృతి కాఫీ తీసుకుని రావడంతో ఏందమ్మా శృతి ఇంతసేపు వెళ్లావు అని అడుగుతాడు పరందామయ్య. అప్పుడు శృతి వాళ్లకు కాఫీ ఇవ్వడంతో అదేంటి శృతి ఉత్త డికాషన్ ఇచ్చావు పాలు వేయడం మర్చిపోయావా అని అంటాడు పరంధామయ్య. కాఫీ తీసుకొని వెళ్ళు మాకొద్దు అనడంతో లేదు అమ్మమ్మ కావాలని తీసుకు వచ్చాను అని అంటుంది శృతి. అప్పుడు శృతి అసలు విషయం చెప్పకుండా ఇలాంటి డికాషన్ తాగితే మంచిది అని పరంధామయ్య అనసూయ చెప్పడానికి ప్రయత్నిస్తుంది.
 

 అప్పుడు పరంధామయ్య అనసూయ ఇలాంటి పిల్లల్ని నమ్ముకుంటే ఇంకా అంతే సంగతులు నువ్వే వెళ్లి కాఫీ పెట్టుకునిరా అని అంటాడు. తర్వాత అనసూయ వాటిని తీసుకొని కిచెన్లోకి వెళుతుండగా శృతి అడ్డుపడి పాలు లేవు ఫ్రిజ్లో ఉన్నాయి అని అంటుంది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి తీసుకుంటాను అని అనగా సుజుకి లాక్ వేసి ఉంది. ప్లీజ్ మీ కోడలు లాస్య దగ్గర ఉన్నాయి అనడంతో వెళ్లి తీసుకొని వస్తాను అని అంటుంది. వెళ్లాను ఇవ్వను అని చెప్పింది కేవలం రోజుకి రెండుసార్లు మాత్రమే కాఫీ ఇవ్వాలి అని ఆర్డర్ కూడా వేసింది అనడంతో దాని పెత్తనం ఏంటి ఇది నా కొడుకు ఇల్లు అనడంతోకాదట తన ఇల్లు అని అంటుంది.
 

అనసూయ దాని బోడి పెత్తనం ఏంటి అనడంతో కరెక్టే కదా అనసూయ తులసి దగ్గర నుంచి లాక్కున్నావు కదా అనగా అనసూయ ఆలోచనలో పడుతుంది. అప్పుడు అనసూయ లాస్య గురించి నందుకు చెబుతాను అని అనగా పరంధామయ్య అడ్డుపడి వద్దు వాడి మనసును ఇలా చేయవద్దు అని అంటాడు. అప్పుడు అనసూయ తులసి దగ్గరికి వెళ్లి పోదాం అనడంతో వద్దు తులసికి చెడ్డ పేరు వస్తుంది అని అంటాడు. అప్పుడు చేసేది ఏమీ లేక మనసుకు నచ్చకపోయినా బాగా లేకపోయినా ఆ డికాషన్ ని తాగుతారు అనసూయ పరందాయ్య.
 

ఆ తరువాత తులసి సామ్రాట్ ఇద్దరు ఇంటికి వెళ్ళగా అప్పుడు తులసి కారు దిగి ఇంటికి వెళ్ళాలని లేదు కారు దిగితే మనసులో ఉన్న అందమైన జ్ఞాపకాలాన్ని వెళ్ళిపోతాయేమో అని భయంగా ఉందిఅని అంటుంది. అప్పుడు సామ్రాట్ చేసిన పనికి తులసి పొగుడుతూ మాట్లాడడంతో నందు నవ్వుతూ ఉంటాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది సామ్రాట్ గారు నేను అమ్మవారికి ముడుపు కట్టాను అప్పుడే నా కలను ఇదంతా ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. ఇప్పటినుంచి ప్రతి కోరికను అమ్మవారికి చెప్పుకొని నెరవేర్చుకుంటాను అనడంతో వెంటనే సామ్రాట్ చిన్న కోరికకు అమ్మవారిని అడగడం మంచిది కాదేమో అని అనడంతో మీ రెడ్డి సామ్రాట్ గారు ప్రతిసారి అమ్మవారికి వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నారు అనగా ఏమి లేదు అని అంటాడు సామ్రాట్.

తర్వాత వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తులసి కారు దిగి ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇంట్లోకి వెళ్లిన తులసి తన జ్ఞాపకాలాన్ని నెమరు వేసుకొని ఆనంద పడుతూ ఉండగా ఇంతలోనే అనసూయ వాళ్లు గుర్తుకు రావడంతో  అనసూయ వాళ్లకు ఫోన్ చేస్తుంది. మరొకవైపు అనసూయ తులసి పొద్దున్నుంచి ఫోన్ చేయలేదు బాధ్యత మరిచిపోయినట్టు ఉంది అనుకుంటూ కోపంగా మాట్లాడుతుంది. ఇంతలోనే తులసి ఫోన్ చేస్తుంది. అప్పుడు తులసి ఏం చేస్తున్నారు అత్తయ్య అని మాట్లాడడంతో అప్పుడు వెంటనే పరంధామయ్య ఏం లేదమ్మా ఊరికే మాట్లాడుకుంటూ సరదాగా కూర్చున్నాము అని అబద్ధాలు చెబుతాడు.

 అప్పుడు తులసి జ్ఞాపకాలు అని వాళ్ళ అత్తమామలతో చెప్పుకొని సంతోష పడుతూ ఉంటుంది. రూ తులసి మీకు కడుపులో మంటగా ఉంటుంది రెండు మూడు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి ఈ విషయాన్ని ఎవరికో ఒకరు చెబుతాను అత్తయ్యకి ఫోన్ ఇవ్వండి అని అంటుంది. అవసరం లేదమ్మా ఇక్కడ మాకు అన్ని సక్రమంగానే ఉన్నాయి అని అబద్ధాలు చెబుతాడు పరంధామయ్య. అప్పుడు తులసి పదందామయ్య మాటలు నిజం అనుకొని ఇన్ని రోజులకు మనకు మంచి రోజులు వచ్చాయి అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు తులసి ఫోన్ కట్ చేయడంతో ఎన్నాళ్ళని ఇలా అబద్ధాలు చెప్పి తులసిని మోసం చేస్తారు అనడంతో తప్పదు అనసూయ అని అంటాడు పరంధామయ్య.

మరొకవైపు తులసి అలాగే కుర్చీలోనే పడుకొని ఉండడంతో ఇంతలా అక్కడికి సరస్వతి వస్తుంది. అప్పుడు తులసి, తల నిమురుతూ ఉండగా తులసి నిద్ర లేచి వాళ్ళ అమ్మని చూసి సంతోషపడుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడగగా నువ్వే కదా తులసి రమ్మని చెప్పావు తులసి ఆశ్చర్య పోతుంది. ఒకవేళ నిజంగానే పిలిచి ఉంటానేమో అమ్మ నాకు గుర్తులేదు అని అంటుంది తులసి. అప్పుడు స్వారీ అమ్మ అనగా నాకు స్వారీ కాదు మీ ఫ్రెండ్స్ కి థాంక్యూ చెప్పు ఇక్కడికి నన్ను పంపించింది అతని అని అనడంతో తులసి సంతోషపడుతుంది. అప్పుడు సరస్వతి సామ్రాట్ గొప్పతనం గురించి వివరిస్తూ గొప్పగా మాట్లాడుతుంది. తరువాత సరస్వతి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తులసికి సామ్రాట్ కి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు తులసి ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా సర్ప్రైజ్లు మిగిలాయ అయిపోయాయ నవ్వుతాడు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరు సంతోషంగా దుర్యోధన జరిగిన విషయాలు తలచుకొని మాట్లాడుకుంటూ ఉంటారు.

click me!