యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ నటిగా ఎదిగింది. యాంకర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత నటిగా అవకాశాలు వచ్చాయి. కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో అవకాశం రావడంతో ఒక్కసారిగా అనసూయకి నటిగా డిమాండ్ పెరిగింది. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి హిట్ చిత్రాల్లో అనసూయకి అవకాశాలు వచ్చాయి.