యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. ఈ లుక్ కోసమే తారక్ అంతలా కష్టపడ్డాడా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆ లుక్ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? డైరెక్టర్ పై తారక్ ఫ్యామిలీ ఎందుకు కోపంగా ఉన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన డ్రాగన్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ ఇప్పటి వరకు కనిపించని విధంగా మాస్ అవతార్‌లో దర్శనమివ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ప్రెజెన్స్ గతం కంటే డిఫరెంట్ గా ఉండటంతో... ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
27
4 నెలల్లో 15 కిలోలు తగ్గిన తారక్
ఎన్టీఆర్ ను ఈసినిమాలో నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో చూపించడంతో.. సినిమా అంతా తారక్ ఎలా ఉంటాడా అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగిపోయింది. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లుక్ గురించి, చేసిన తాజా కామెంట్స్ మరింత హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, డ్రాగన్ సినిమాలోని పాత్ర కోసం ఎన్టీఆర్ కేవలం నాలుగు నెలల్లో దాదాపు 15 కిలోల బరువు తగ్గారని వెల్లడించారు.
37
సీరియస్ గా తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్..
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “దాదాపు ఏడాదిన్నర క్రితం, షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న క్రమంలో.. ఒక లుక్ టెస్ట్ చేశాం. ఆ సమయంలో ఈ పాత్ర కోసం తారక్ ఇంకాస్త సన్నగా, షార్ప్ లుక్‌లో కనిపిస్తే బాగుంటుందని సూచించాను. హంతకుడి పాత్ర కావడంతో కొద్దిగా బరువు తగ్గాలని మాత్రమే చెప్పాను. నేను చేసిన సూచనను ఎన్టీఆర్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు ఆయన షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఏకంగా 15 కిలోలు తగ్గిపోయారు. ఒక దశలో ఆయన చాలా బలహీనంగా కనిపించడంతో... ఇక చాలు ఆపమని నేను చెప్పినా వినలేదని'' ప్రశాంత్ నీల్ అన్నారు.
అంతలా బరువు తగ్గి.. కంప్లీట్ గా లుక్ చేంజ్ అవ్వడంతో.. ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా భయపడ్డారు. ఆయన భార్య, తల్లి, స్నేహితులు అందరూ నాపై కోపంగా ఉన్నారు. ఇక ఆపమని ఎన్టీఆర్ ను వారి ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేశారట. కానీ ఆయన మాత్రం అనుకున్న లుక్ వచ్చే వరకు ఆపలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ టీమ్ కూడా అసంతృప్తిగా ఫీల్ అయిందట. ''కానీ నేను కేవలం కొద్దిగా బరువు తగ్గమని మాత్రమే చెప్పాను. తారక్ మాత్రం దానిని పూర్తి ఛాలెంజ్‌గా తీసుకున్నారు” అని ప్రశాంత్ నీల్ అన్నారు.
57
30 నిమిషాల్లో మొదలు పెట్టి..
అయితే ఈ మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా ప్రొఫెషనల్‌గా జరిగిందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. తాను ఈ విషయం చెప్పిన 30 నిమిషాల్లోనే ఎన్టీఆర్ ట్రైనర్ అక్కడికి వచ్చారని, మరుసటి రోజు ఉదయం నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యిందని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఈ ప్రక్రియ కోసం షూటింగ్‌ను కొన్ని నెలల పాటు వాయిదా వేసినప్పటికీ, చివరకు వచ్చిన ఫలితం పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని డైరెక్టర్ అన్నారు.
67
బరువు తగ్గడం మాత్రమే కాదు..
ఇక గతంలో ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనర్ గా ఉన్న కుమార్ మన్నవ కూడా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఎంత కష్టం దాగి ఉందో వివరించారు. కేవలం బరువు తగ్గడం కాకుండా, శరీరాన్ని మరింత చురుకుగా, లీన్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భారీ వెయిట్ ట్రైనింగ్‌కు బదులుగా.. ఫంక్షనల్ మూవ్‌మెంట్స్, కార్డియో బేస్డ్ వ్యాయామాలపై ఎక్కువ దృష్టి పెట్టారని తెలిపారు.
77
అనుకున్నది సాధించిన ఎన్టీఆర్..
ప్రతిరోజూ ఉదయం 45 నుంచి 90 నిమిషాల పాటు ప్రత్యేక వర్కౌట్లు చేస్తూ.. మజిల్స్ పెంచే హై ప్రోటీన్ డైట్‌కు బదులుగా, తక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ను ఎన్టీఆర్ తీసుకున్నారు. పక్కా ప్లానింగ్ తో ఆయన తన శరీరాన్ని పాత్రకు తగిన విధంగా మార్చుకోగలిగారని తెలిపారు. మొత్తానికి ఎన్టీఆర్ తాను అనుకున్నది సాధించి.. డైరెక్టర్ కు కావల్సిన లుక్ లోకి వచ్చారు. అందుకోసం ఆయన చేసిన సాహసం గురించి చెప్పుకుని అభిమానులు గర్వపడుతున్నారు.