గతంలో అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా పనిచేసింది. కానీ వివిధ కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ షోకి దూరమైంది. జబర్దస్త్ లో కొన్నిసార్లు తాను ఇబ్బంది పడ్డట్లు అనసూయ పేర్కొంది.
టాలీవుడ్ లో సెలెబ్రిటీలలో అనసూయ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక వివాదంలో అనసూయ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల శివాజీ మహిళలని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం చూశాం. ఆ తర్వాత ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ట్రోలర్స్ కి కూడా సమాధానం ఇస్తూ అనసూయ సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు చేశారు.
25
జబర్దస్త్ షోలో అనసూయ
అనసూయ గతంలో జబర్దస్త్ షోలో యాంకర్ గా చేశారు. కానీ ఊహించని విధంగా అనసూయ ఆ తర్వాతి కాలంలో జబర్దస్త్ కి దూరమైంది. తన సినిమాలతో బిజీ అయిపొయింది. జబర్దస్త్ లో అనసూయ, హైపర్ ఆది మధ్య జరిగిన డబుల్ మీనింగ్ సంభాషణలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. వాటి వల్ల అనసూయ ఇప్పటికీ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అయితే దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో అనసూయ క్లారిటీ ఇచ్చింది.
35
హద్దులు దాటిన మాట వాస్తవమే
జబర్దస్త్ లో కొనసాగాలా, మానేయాలా అనే అంశంపై రెండేళ్ల పాటు అలోచించి నిర్ణయం తీసుకున్నాను. మల్లెమాల చాలా మంది ప్రొడక్షన్ సంస్థ. జబర్దస్త్ లో మేమంతా ఒక ఫ్యామిలీలా ఉన్నాం. ఈ క్రమంలో సినిమాల్లో నాకు మంచి అవకాశాలు రావడం ప్రారంభం అయింది. జబర్దస్త్ షో చాలా మంది ఫన్ షో. కానీ కొన్నిసార్లు హద్దులు దాటిన మాట వాస్తవమే. కానీ దానితో నాకు సంబంధం లేదు.
ఎందుకంటే షో అయినా, సినిమా అయినా నటన మాత్రమే. అది నిజం కాదు. జబర్దస్త్ లో కనిపించిన నేను రియల్ కాదు. అది నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు. అయినప్పటికీ జబర్దస్త్ లో కొన్నిసార్లు నేను ఇన్వాల్వ్ అయిన కామెడీ, డైలాగ్స్ పట్ల ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యాను. ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది. నాకు సినిమాల్లో అవకాశాలు వస్తుండడంతో జబర్దస్త్ కి దూరం కావడమే బెటర్ నిపించింది.
55
కారణాలు ఇవే
అందుకే జబర్దస్త్ ని వదిలేసినట్లు అనసూయ పేర్కొంది. జబర్దస్త్ వదిలేయడానికి అందులో హద్దులు దాటే కామెడీతో పాటు నా సినిమాలు కూడా కారణం. జబర్దస్త్ కారణంగా సినిమాలకు డేట్లు అడ్జెస్ట్ చేయడం కష్టంగా అనిపించింది. అందుకే జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసి ఆడియన్స్ నన్ను నటిగా మాత్రమే గుర్తుంచుకోవాలి అని డిసైడ్ అయినట్లు అనసూయ పేర్కొంది.