Chiru Vs Anil: థియేటర్లలో ప్రస్తుతం సంక్రాంతి సినిమాలు సందడి చేస్తున్నాయి. 2027 సంక్రాంతికి కూడా అప్పుడే బెర్తులు ఖరారు అయ్యాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెంట్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం 250 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడే 2027 సంక్రాంతి బెర్తులు కూడా ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది. 2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో వచ్చారు. 2027 కి మాత్రం చిరంజీవి సినిమాతో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 2027 సంక్రాంతికి బెర్తులు ఖరారు చేసుకున్నట్లు వార్తలు వస్తున్న సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
27
మెగా 158
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రెండవ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. బాబీ, చిరు కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం 2023 సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
37
వెంకీ - అనిల్
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తదుపరి చిత్రం నాగార్జునతో ఉండొచ్చు అని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ దిల్ రాజు మరోసారి వెంకీ అనిల్ కాంబో సెట్ చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఇదే జరిగితే వెంకీ అనిల్ చిత్రం మెగా 158తో పోటీ పడాల్సి ఉంటుంది.
శర్వానంద్ 39వ చిత్రం మైత్రి మూవీస్ బ్యానర్ లో ఉండబోతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
57
సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరో మూవీ
ఈ సంక్రాంతికి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి అనగనగా ఒక రాజు చిత్రం రిలీజ్ అయింది. వచ్చే సంక్రాంతికి కూడా ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమాని నాగవంశీ ప్లాన్ చేస్తున్నారట. వివరాలు తెలియాల్సి ఉంది.
67
తేజ సజ్జా - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తేజ సజ్జా కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
77
రజినీకాంత్ 173
సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ చిత్రం కూడా 2027 సంక్రాంతి బరిలో ఉంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.