చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులని బ్రేక్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటైన హీరో అనే గుర్తింపు కృష్ణకి వచ్చింది ఆ చిత్రంతోనే. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో సాధించని ఘనత అంటూ లేదు. సినిమా కోసం ఎన్నో ప్రయోగాలు, లెక్కకు మించి సాహసాలు చేశారు. తెలుగు సినిమా రూపురేఖలు మారడంలో కృష్ణ కీలక పాత్ర పోషించారు. సూపర్ స్టార్ కృష్ణకి 70వ దశకం గోల్డెన్ డికేడ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ దశాబ్దంలోనే కృష్ణకి మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు లాంటి అద్భుతమైన చిత్రాలు పడ్డాయి.
25
బిగ్గెస్ట్ హిట్ గా పండంటి కాపురం
1972లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన పండంటి కాపురం చిత్రం విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. ఈ చిత్రాన్ని కృష్ణ తన సొంత నిర్మాణంలో రూపొందించారు. కృష్ణ సోదరులు జి హనుమంతరావు, ఆదిశేషగిరి రావు నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ తో పాటు జమున, ఎస్వీ రంగారావు, గుమ్మడి, విజయనిర్మల, బి సరోజాదేవి, జయసుధ, ప్రభాకర్ రెడ్డి లాంటి లెజెండ్రీ నటీనటులు నటించారు.
35
ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటైన హీరో
ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటైన హీరో సూపర్ స్టార్ కృష్ణ అనే గుర్తింపు పండంటి కాపురం చిత్రంతోనే వచ్చింది అని తెలిపారు. అంతకు ముందు 1971లో ఏఎన్నార్ నటించిన దసరా బుల్లోడు విడుదలై ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది.
ఆ సినిమాని బీట్ చేయాలనే టార్గెట్ తోనే కృష్ణ గారు పండంటి కాపురం చిత్రం ప్రారంభించారు. ఆయన అనుకున్నట్లుగానే పండంటి కాపురం సంచలన విజయం సాధించి దసరా బుల్లోడు కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది అని ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ చిత్రాన్ని 1975లో హిందీలో సునెహ్రా సన్సార్ అనే పేరుతో రీమేక్ చేశారు. హిందీలో రాజేంద్ర కుమార్, హేమ మాలిని జంటగా నటించారు. రాజేంద్ర కుమార్ కి అంతగా క్రేజ్ లేదు. అయినప్పటికీ ఈ చిత్రం హిందీలో బాగానే ఆడింది.
55
శ్రీదేవికి ఝలక్
తెలుగులో జయసుధ చిన్న పాత్రలో నటించారు. ఆమె పాత్ర కోసం హిందీలో శ్రీదేవిని తీసుకున్నాం. సునెహ్రా సన్సార్ చిత్ర హక్కులని నార్త్ లో ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇచ్చాం. శ్రీదేవి పాత్ర కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రషెస్ చూశారు. శ్రీదేవిని చూసి ఈ అమ్మాయి బాగలేదు.. ఆమెని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటేనే ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని వాళ్ళు అడ్డం తిరిగారు. అప్పటికి శ్రీదేవికి అంత క్రేజ్ లేదు. ఇక చేసేది లేక శ్రీదేవిని తప్పించి వేరే అమ్మాయితో షూటింగ్ పూర్తి చేసినట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు.