ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
జబర్ధస్త్ 12 ఏళ్ల ఉత్సవాలకు సబంధించిన ఫుల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రోమో చూసి ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఆగస్టు 8,9 తేదీల్లో ఈ జబర్థస్త్ స్పెషల్ ఎపిసోడ్ ఈటీవీ ద్వారా ప్రసారం కాబోతోంది. ఇక ఈ ప్రోమో ద్వారా చాలామంది ఎమోషనల్ కామెంట్స్ ను పూర్తిగా చూడాల్సి ఉంది. చంద్రతో పాటు, ఆది, రచ్చ రవి, రాకెట్ రాఘవలాంటి వారు ఈ షోలో తమ గతాన్ని పంచుకున్నారు. పంచ్ లు వేస్తూ నవ్వుకున్నారు. ఈ షో ద్వారా నాగబాబు కూడా చాలా కాలం తరువాత నవ్వులతో సందడి చేశారు.