
తెలుగు తెర సోగ్గాడు శోభన్‌బాబు, జయలలిత మధ్య రిలేషన్ గురించి అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. పెళ్లి వరకు వెళ్లారు. కానీ మ్యారేజ్ చేసుకుంటే చరిత్రలో కలిసిపోతామని, విడిగానే ఉండిపోయారు. శోభన్‌బాబు మ్యారేజ్ చేసుకుందామని పట్టుబట్టినా, జయలలితనే నో చెప్పారట. మనం ఇలానే ఉండిపోదామని చెప్పిందట. అలా ఈ ఇద్దరు మనుషులుగా వేరుగా ఉన్నా, మనసుల్లో మాత్రం కలిసే ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉంటే జయలలిత.. అప్పటి తమిళ సూపర్ స్టార్, అప్పటి సీఎం ఎంజీఆర్ కి శిష్యురాలిగా ఉండిపోయింది. ఆయన గైడెన్స్ లో రాజకీయాల్లో రాణించింది. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని కొనసాగించింది. తాను కూడా సీఎం అయ్యింది. ఎంజీఆర్ మరణం అనంతరం తమిళనాడు రాజకీయాలను శాసించింది. తన మార్క్ పాలనతో అందరిచేత మన్ననలు పొందింది. తమిళనాడు ప్రజలచేత `అమ్మ`గా పిలిపించుకుంది. తన వ్యక్తిగత జీవితంలో అమ్మ కాలేకపోయినా జనం చేత అమ్మగా పిలిపించుకుంది జయలలిత.
ఇదిలా ఉంటే జయలలిత సీఎం కాకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్షాలకు సంబంధించిన వాదనలు జరిగే క్రమంలో జయలలితని దారుణంగా అవమానించారు. ఆమెని గలాట చేశారు. చీరలాగి అసెంబ్లీ నుంచి గెంటివేశారు. అనరాని ఒక మాట అన్నారు. ఇలాంటి దారుణమైన అవమానం జయలలిత ఫేస్ చేసినట్టు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు తెలిపారు.
ఆ వివాదం శోభన్‌బాబు గురించే అని, వీరి మధ్య సంబంధాన్ని అసెంబ్లీలో లేవనెత్తి జయలలితని అవమానించారట. ఇది ఆమె తట్టుకోలేకపోయింది. చాలా కుంగిపోయింది. ఈ విషయం తెలిసిన శోభన్ బాబు సైతం తట్టుకోలేకపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడట. తన కోసం ఇంత త్యాగమా చేయాలా అని ఆవేదన చెందారట. ``కేవలం తన వల్లనే ఇంతటి బాధ అనుభవించాల్సి వచ్చిందని ఎంతో మదనపడ్డారట సోగ్గాడు. అయితే ఆమెని ఓదార్చాలని ఇంటికి వెళ్లాడట సోగ్గాడు. కానీ అప్పటికే ఆమె రాజకీయంగా చాలా ఎదిగిపోయింది. అప్పటికే ఎంజీఆర్ పక్కన ఉండటంతో ఆమెని చాలా మార్చేశారు. పెళ్లి వద్దు అని చెప్పడమే కాదు, సైకలాజికల్‌గా సోగ్గాడికి దూరం చేశాడు. జయలలిత కూడా మనసుని మార్చుకోవడం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించింద``ని చెప్పారు ఇమ్మంది రామారావు.
ఆయన ఇంకా కొనసాగిస్తూ, `ఆ రోజు అసెంబ్లీలో ఆ ఘటన తర్వాత తమిళనాడు రాజకీయాలు అట్టుడికిపోయాయి. అదే సమయంలో శోభన్ బాబు ఎంతో బాధపడ్డారు. ఎలాగైనా ఆమెని కలవాలని ఇంటికి వెళితే, ఇప్పుడు రెస్ట్ లేదు, నాకు విశ్రాంతి కావాలి, ఎవరినీ చూసే పరిస్థితుల్లో లేను అని సెక్యూరిటీ చెప్పి పంపించింది జయలలిత. మనసులో ప్రేమ ఉన్నా సోగ్గాడిని దూరం చేసుకోవడం కోసం కఠువుగా ప్రవర్తించింది. కానీ అది సోగ్గాడికి దారుణమైన అవమానమే. అదే సమయంలో శోభన్ బాబు ఇటు ఫ్యామిలీని వదులుకోలేని పరిస్థితి, అటు జయలలితని దూరం చేసుకోలేని పరిస్థితి. దీంతో మానసికంగా చాలా సంఘర్షణ అనుభవించాడు. ఇలా ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకున్నారు. మనసులను చంపుకున్నారు. గుండెని రాయి చేసుకుని బతికారు. పెళ్లికి మించిన బంధం వారిది` అని వెల్లడించారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు ఇమ్మంది రామారావు.