Anaganaga Oka Raju Collections: `అనగనగా ఒక రాజు` మూవీ 7 రోజుల కలెక్షన్లు.. నాగవంశీ పంట పండింది

Published : Jan 21, 2026, 08:18 PM IST

నవీన్‌ పొలిశెట్టి నటించిన `అనగనగా ఒక రాజు` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. ఈ మూవీ భారీ వసూళ్లని రాబట్టింది. లాభాల్లో వెళ్తోంది. మరి ఈ చిత్రానికి ఎంత వచ్చాయనేది చూస్తే. 

PREV
15
నవీన్‌ పొలిశెట్టికి నాల్గో హిట్‌

నవీన్‌ పొలిశెట్టి వరుసగా విజయాలు అందుకుంటున్నారు. ఇప్పటికే `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`, `జాతిరత్నాలు`, `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` మూవీస్‌తో హ్యాట్రిక్‌ హిట్ అందుకున్నారు. ఇప్పుడు `అనగనగా ఒక రాజు` చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీసుని షేక్‌ చేస్తోంది. రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

25
ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయిన అనగనగా ఒక రాజు

`అనగనగా ఒక రాజు` మూవీలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించగా, మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా చేసింది. మారి దర్శకత్వం వహించారు. నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన విషయం తెలిసిందే. తొలి షో నుంచే హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. అదే జోరు చూపిస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ ఉండటం, కామెడీ బాగా వర్కౌట్ కావడం, సంక్రాంతి పండక్కి సరిగ్గా సూట్‌ అయ్యే సినిమా కావడంతో దీన్ని చూసేందుకు జనం క్యూ కట్టారు. దీంతో వసూళ్ల వర్షం కురిపించింది.

35
అనగనగా ఒక రాజు బాక్సాఫీసు కలెక్షన్లు

ఏడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు వంద కోట్లు దాటిందని చిత్ర బృందం ప్రకటించింది. కానీ సుమారు రూ.71కోట్ల వరకు రాట్టినట్టు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ అందించిన లెక్కల ప్రకారం ఈ మూవీకి ఇప్పటి వరకు రూ.71కోట్లు రాగా, రూ.40కోట్ల షేర్‌ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రానికి సుమారు రూ.50కోట్లు రావడం విశేషం. ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రాల్లో చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` తర్వాత ఈ చిత్రానిదే ఎక్కువ జోరు ఉండటం విశేషం.

45
నాగవంశీకి లాభాల పంట

`అనగనగా ఒక రాజు` మూవీకి థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.28కోట్లు. అంటే రూ.29కోట్ల షేర్‌ వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారు నాలభై కోట్లకుపైగా షేర్‌ రావడంతో ఇప్పుడు దాదాపు రూ.12కోట్ల లాభాలు వచ్చాయని సమాచారం. ఇటీవల కాలంలో నాగవంశీ నిర్మించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. కానీ ఇప్పుడు నవీన్‌ పొలిశెట్టి మూవీ మాత్రం లాభాల పంట పండింది. దీంతో నాగవంశీ బౌన్స్ బ్యాక్‌ అయ్యారని చెప్పొచ్చు.

55
అనగనగా ఒక రాజు కథ ఇదే

`అనగనగా ఒక రాజు` మూవీ కథ విషయానికి వస్తే.. ఇందులో నవీన్‌ పొలిశెట్టి ఒక జమీందారి మనవడు. తాత చేసిన పనికి ఆస్తులన్నీ పోతాయి.  పేరుకు రాజు అయినా అన్నీ అప్పుల పరిస్థితి. ఇలాంటి సమయంలో ఓ బాగా రిచ్‌ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో మీనాక్షి చౌదరీ తగులుతుంది. వారిది కూడా పెద్ద సంపన్న ఫ్యామిలీ. ఆమెని పెళ్లి చేసుకుంటే లైఫ్‌ సెట్‌ అనుకుంటాడు నవీన్‌. ఆమెని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ల ఆస్తులన్నీ తనకే వస్తాయని భావిస్తాడు. తీరా పెళ్లి అయ్యాక వాళ్లకి కూడా అన్నీ అప్పులే అని తెలుస్తుంది. దీంతో నీరసించిపోయిన నవీన్‌.. ఆ తర్వాత ఏం చేశాడు? ఊర్లో ప్రెసిడెంట్‌గా ఎందుకు పోటీ చేశాడు? చివరికి ఏం జరిగిందనేది ఈ సినిమా కథ. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. నవీన్‌ కామెడీ హైలట్‌గా నిలుస్తుంది. చివరికి ఎమోషన్స్ బాగా వర్కౌట్‌ అయ్యాయి. దీంతో ఆడియెన్స్ ఈ మూవీని బాగా చూస్తున్నారు. ఇంకా విజయవంతంగా రన్‌ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories