చరణ్ కి చెప్పుకోవడానికి చిరుత అయినా ఉంది, నాకు అది కూడా లేదు.. ఎన్టీఆర్ కామెంట్స్ తో రాజమౌళి మైండ్ బ్లాక్

Published : Jan 21, 2026, 06:24 PM IST

రాంచరణ్ కెరీర్ లో చిరుత సినిమా అయినా ఉందని తన కెరీర్ లో అది కూడా లేదని ఎన్టీఆర్ అన్నారు. తారక్ కామెంట్స్ తో రాజమౌళి మైండ్ బ్లాక్ అయింది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
రాంచరణ్ కి ఎదురుదెబ్బ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగింది. అయితే ఆ వెంటనే వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీతో ఊహించని దెబ్బ తగిలింది. ప్రస్తుతం చరణ్ పెద్ది మూవీతో తిరిగి పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. 

25
రాంచరణ్ కెరీర్ లో చిరుత ఒక్కటే.. 

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ టైంలో ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మీ కెరీర్ లో మీరు ఎప్పుడు ఆడియన్స్ తో కలసి సినిమా చూశారు అని రాజమౌళి ప్రశ్నించారు. రాంచరణ్ సమాధానం ఇస్తూ నేను ఆడియన్స్ తో కలిసి చూసిన సినిమా చిరుత ఒక్కటే అని అన్నారు. చిరుత తర్వాత ఇక చూడలేదా అని అడుగగా.. మీరు మగధీర చిత్రాన్ని స్పెషల్ షో వేశారు కదా అప్పుడు చూశాను అని చరణ్ అన్నారు. అది అభిమానుల తో చూసినట్లు కాదు.. అది కేవలం ఇండస్ట్రీ ప్రముఖుల కోసం వేసిన షో అని రాజమౌళి తెలిపారు. 

35
ఎన్టీఆర్ కామెంట్స్ కి రాజమౌళి షాక్ 

ఇదే ప్రశ్న రాజమౌళి జూ.ఎన్టీఆర్ ని అడిగారు. కనీసం రాంచరణ్ కి చెప్పుకోవడానికి చిరుత అయినా ఉంది. నేను ఇంత వరకు ప్రేక్షకులతో కలిసి ఒక్క సినిమా కూడా చూడాలి అని అన్నారు. తారక్ సమాధానం విని రాజమౌళి ఆశ్చర్యపోయారు. నీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమాని కూడా ఆడియన్స్ తో చూడలేదా అని రాజమౌళి ఆశ్చర్యపోతూ అడిగారు. లేదు కనీసం ఆర్ఆర్ఆర్ సినిమాతో అయినా ఆ ఏర్పాట్లు చేయండి అని ఎన్టీఆర్ జక్కన్నని రిక్వస్ట్ చేశారు. 

45
ఆర్ఆర్ఆర్ తో తీరిన కోరిక 

మొత్తానికి ఎన్టీఆర్ కోరిక ఆర్ఆర్ఆర్ తో తీరింది. ఆ చిత్రాన్ని తారక్ ఏఎంబి సినిమాస్ లో ప్రేక్షకులతో చూశారు. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాంచరణ్ చిరుతతో ఎంట్రీ ఇచ్చారు. 

55
ఇద్దరి సినిమాలు రాజమౌళితోనే.. 

 వీరిద్దరి తమ రెండవ చిత్రం కోసం రాజమౌళి దర్శకత్వంలో నటించడం విశేషం. ఎన్టీఆర్ రెండవ చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 కాగా రాంచరణ్ రెండవ చిత్రం మగధీర. 

Read more Photos on
click me!

Recommended Stories