విశాల్, సుందర్ సి కాంబోలో వస్తున్న ఈ కొత్త సినిమాను అవ్ని సినీ మాక్స్ బ్యానర్‌పై ఖుష్బూ, ఆమె కూతురు అనందిత నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. దీనికి 'పురుషన్' అని పేరు పెట్టారు. చిత్ర బృందం ప్రోమోను కూడా విడుదల చేసింది. అందులో మొదట తమన్నా భర్తగా విశాల్ శాంతంగా ఇంటి పనులు చేస్తుంటాడు. ఆ తర్వాత యోగిబాబు ఇంటికి రాగా, టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లి యాక్షన్ మోడ్‌లోకి మారతాడు.
ఇంట్లోకి వచ్చిన రౌడీలను శబ్దం లేకుండా కొట్టి పడేస్తాడు. అది చూసి యోగిబాబు మాత్రమే షాక్ అవుతాడు. భార్య ముందు సాధువుగా ఉండే విశాల్, ఆమెకు తెలియకుండా ఎందుకు గొడవలకు దిగుతున్నాడు? విశాల్‌ను చంపడానికి వచ్చిన రౌడీలు ఎవరు? అనే విషయాలను యాక్షన్ కామెడీగా ఈ సినిమా చూపించబోతోందని ప్రోమో చూస్తే తెలుస్తోంది.