రామ్ చరణ్ పెద్ది కోసం ఏకంగా విజయనగరం సెట్, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే?

Published : Jul 22, 2025, 11:59 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా కోసం భారీగా సెట్లు కూడా నిర్మిస్తున్నారు టీమ్. వాటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే?

PREV
15

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈక్రమంలోనే చరణ్ గ్లోబల్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్య కాలంలో చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయినా సరే తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతున్నాడు మెగా హీరో. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

25

పెద్ది కోసం విజయనగరం సెట్

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న పెద్ది సినిమా షూటింగ్ విజయనగరం బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ చేయాల్సి ఉంది. అయితే అక్కడ చేయాల్సిన షుూటింగ్ కు సంధించిన అనుమతులు కూడా తీసుకున్నారట టీమ్. కాని అక్కడ వాతావరణం షూటింగ్ కు అనుకూలంగా లేకపోవడంతో .. ఈషెడ్యూల్ ను కూడా హైదరాబాద్ లోనే చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే విజయనగరం బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కించాల్సిన సీన్స్ చాలా తక్కువ ఉండటంతో, వాటికి కూడా ప్రత్యేకమై సెట్స్ వేయాల్సి వస్తుందట. అందుకుకోసం దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి ఆ సెట్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్నట్టు సమాచారం.

35

క్రికెటర్ గా గ్లోబల్ స్టార్

ఇప్పటికే ‘పెద్ది’ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా పెద్దిని రూపొందిస్తున్నారు. రూరల్ బ్యాక్ గ్రౌండ్ స్పోర్డ్స్ స్టోరీ గా పెద్ది తెరకెక్కుతోంది. ఈసినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిప్ వీడియోకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈమూవీని 2026 లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి అప్పటికి షూటింగ్ కంప్లీట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

45

మాస్ లుక్ లో మెగా పవర్ స్టార్

ఇక ఈమూవీలో బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. వెంటనే రామ్ చరణ్ సరసన అవకాశం కొట్టేసింది. ఈసినిమాలో పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా జాన్వీ కనిపించబోతోంది. 

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చుకుర్చుతున్నారు. ఇకప్పటికే ఈసినిమాకు సబంధించి ట్యూన్స్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఇక పెద్ది సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా తన ఫ్యాన్స్ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు.

55

రామ్ చరణ్ జిమ్ ఫోటో వైరల్

పెద్దిలో రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపనించబోతున్నాడు రామ్ చరణ్ . ఈ లుక్ కోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా జిమ్ లో రామ్ చరణ్ వర్కౌట్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో చరణ్ ను చూసి దిల్ ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్. చరణ్ బాడీ ట్రాన్స్పర్మేషన్ కోసం ఎంత కష్టపడుతున్నాడో అందులో తెలిసిపోతుంది. దాంతో సినిమాలపై, తన పాత్రపై చరణ్ కు ఉన్న డెడికేషన్ ను ప్రశంసిస్తున్నారు ప్యాన్స్.

Read more Photos on
click me!

Recommended Stories