Ramayana Sita Controversy: రామాయణం సినిమాలో సీత ఫైట్ సీన్స్‌పై వివాదం చెలరేగింది. ప్రాచీన గ్రంథం “అద్భుత రామాయణం”లో సీత రావణుడిని సంహరించిందని రచయిత అమీష్ త్రిపాఠి పేర్కొన్నారు.
సాయి పల్లవి సీత యోధురాలే.. ముఖేష్ ఖన్నాకు అమీష్ త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్
నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణం సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించారు. సినిమా నవంబర్ 5న దీపావళి సందర్భంగా విడుదలైంది. 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, పుష్ప 2 రికార్డును కూడా అధిగమించింది.
అయితే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తున్నప్పటికీ, సినిమాలోని కొన్ని సీన్లపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీత కత్తి పట్టి యుద్ధం చేయడం, అసురులతో పోరాడటం వంటి సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత అమీష్ త్రిపాఠి ఈ వివాదంపై స్పందించారు. అయితే, సీత యోధురాలిగా కనిపించడాన్ని ఆయన సమర్థించారు.
24
సీత యోధురాలే.. అద్భుత రామాయణ ప్రస్తావన
'సీత - వారియర్ ఆఫ్ మిథిల' వంటి బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలు రాసిన అమీష్ త్రిపాఠి, సీతను యోధురాలిగా చూపించడం కొత్త ఆలోచన కాదని చెప్పారు. స్క్రీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సీత కేవలం సహనం, త్యాగానికి మాత్రమే కాదు, శక్తిమంతమైన యోధురాలిగా కూడా అద్భుత రామాయణంలో కనిపిస్తారని ఆయన తెలిపారు.
అద్భుత రామాయణంలో సాధారణ రావణుడి కంటే ఎక్కువ బలవంతుడైన మరో రావణుడి ప్రస్తావన ఉందని అమీష్ చెప్పారు. ఆ శక్తిమంతమైన రావణుడిని సీత సంహరించిందని ఆ గ్రంథం చెబుతోందని వివరించారు. కాబట్టి సినిమా మేకర్స్ ఈ పాత్రను కొత్తగా సృష్టించారని అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
34
ముఖేష్ ఖన్నా అభ్యంతరాలు
సినిమాలో సాయి పల్లవి ఫైటింగ్ సీన్లపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీత యోధురాలు కాదని నటుడు ముఖేష్ ఖన్నా కూడా ప్రశ్నలు లేవనెత్తారు. సీతను అలా చూపించడం సరైనది కాదని ఆయన వాదించారు. దీనిపై స్పందించిన అమీష్ త్రిపాఠి, మన విద్యా వ్యవస్థలో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలన్ని కోణాలను పూర్తిగా బోధించరని అన్నారు.
అందువల్లే చాలామందికి వీటిలోని వేర్వేరు వెర్షన్ల గురించి తెలియదని చెప్పారు. వాల్మీకి పేరుతో వాల్మీకి రామాయణం, అద్భుత రామాయణం, ఆనంద రామాయణం వంటి మూడు వెర్షన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిలో సీత యోధురాలిగా కనిపించే కోణం కూడా ఉందని గుర్తుచేశారు.
రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల చారిత్రకతపై కూడా అమీష్ త్రిపాఠి తన అభిప్రాయం చెప్పారు. వీటిలోని ప్రధాన ఘటనలు నిజంగా జరిగాయ అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాలక్రమేణా కథల్లో కొన్ని కల్పిత లేదా అద్భుత అంశాలు కలిసి ఉండవచ్చని తెలిపారు.
ఈ విషయాన్ని వివరించడానికి ఆయన గ్రీకు ఇతిహాసం ఒడిస్సీ, ట్రోయ్ నగర ఉదాహరణ ఇచ్చారు. ఒకప్పుడు హోమర్ రాసిన కథను కేవలం కల్పనగానే భావించేవారని గుర్తుచేశారు. కానీ 19వ శతాబ్దంలో ట్రోయ్ నగరం బయటపడిన తర్వాత ట్రోజన్ యుద్ధంపై కొత్త చర్చ మొదలైందని చెప్పారు. కథలో మ్యాజిక్ లేదా కల్పన ఉన్నంత మాత్రాన మూల ఘటనలు కల్పితమని అనుకోకూడదని అన్నారు.