Amitshah: అమిత్‌ షాని కలిసిన సాయిపల్లవి, రణ్‌బీర్‌ కపూర్‌.. బాక్సాఫీసు వద్ద రామాయణం నాన్‌ స్టాప్‌ ర్యాంపేజ్

Published : Nov 26, 2026, 12:19 PM IST

Amitshah: రణ్‌ బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యష్‌ నటించిన `రామాయణం` సినిమా బాక్సాఫీసు వద్ద ఇంకా అదరగొడుతోంది. ఈ క్రమంలో టీమ్‌ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాని కలిశారు.

PREV
13
బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోన్న రామాయణం

రణ్‌ బీర్ కపూర్, యష్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన `రామాయణం` మూవీ బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లతో రన్‌ అవుతుంది. ఈ సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్‌ అయినా బుధవారం నుంచి మళ్లీ పుంజుకోవడం విశేషం. 21వ రోజు(బుధవారం) ఈ చిత్రానికి వసూళ్లు పెరిగాయి. దాదాపు రూ.17.35కోట్లు వసూలు చేయడం విశేషం. ఇండియా గ్రాస్‌ రూ.11.35కోట్లు, ఓవర్సీస్‌లో ఆరు కోట్లు వసూలు చేసింది. మంగళవారంతో పోల్చితే బుధవారం ఈ సినిమా కలెక్షన్లు పెరగడం విశేషం. ఇక మొత్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.1755.50కోట్లు రాబట్టింది. ఇండియాలో దీనికి రూ.1173.50కోట్ల గ్రాస్‌ వచ్చింది. నెట్‌ కలెక్షన్లు రూ.982.45కోట్లు. ఓవర్సీస్‌లో రూ.582కోట్లు వచ్చాయి.

23
అమిత్‌ షాని కలిసిన రామాయణం టీమ్‌

ఇంకా సాలిడ్‌గా బాక్సాఫీసు వద్ద రన్‌ అవుతుంది. `బాహుబలి 2`, `ధురంధర్‌ 2`, `పుష్ప 2` రికార్డులను బ్రేక్‌ చేసే దిశగా వెళ్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు చిత్ర బృందం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాని కలిశారు. మర్యాదపూర్వకంగా వాళ్లు హోంమంత్రిని కలవడం విశేషం. ఇందులో హీరో రణ్‌ బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, దర్శకుడు నితేష్‌ తివారి, నిర్మాత నమిత్‌ మల్హోత్రా ఉన్నారు. మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు. రామాయణం మూవీకి సంబంధించిన చర్చ, అలాగే హిందుత్వం వంటి అంశాలపై వీరి మధ్య డిస్కషన్‌ జరిగినట్టు సమాచారం.

33
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రామాయణం

రాముడిగా రణ్‌ బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్‌ నటించిన ఈ చిత్రానికి నితీష్‌ తివారి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. నమిత్‌ మల్హోత్రా నిర్మించారు. ఇందులో కాజల్‌, రకుల్ ప్రీత్‌ సింగ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. నవంబర్‌ 5న దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందింది. మొదటి పార్ట్ విడుదలైంది. దాదాపు రూ.2500కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో విడుదలైన ఈ మూవీ ఆ టార్గెట్‌ ని చేరడానికి స్ట్రగుల్‌ అవుతుంది. మరో పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి రాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories