రజినీకాంత్ 173వ సినిమాగా రాబోతున్న ‘ధర్మన్’ చిత్రానికి అశ్వంత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2004-2005 మధ్యలో వచ్చిన జపనీస్ యానిమే సిరీస్ ‘మాన్స్టర్’ స్టోరీ ఆధారంగానే ఈ సినిమా వస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాన్స్టర్ సిరీస్ కథ అంతా ఒక డాక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మేయర్ కు ఆపరేషన్ చేయాల్సిన టైంలోనే, మరో పిల్లాడి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి ఆ డాక్టర్ కు ఎదురవుతుంది.
అయితే మేయర్ కు బదులుగా ఆ పిల్లాడిని కాపాడాలని డాక్టర్ నిర్ణయించుకుంటాడు. దీనివల్ల మేయర్ చనిపోతాడు. కానీ, ఆ పిల్లాడు బతికి పెద్దయ్యాక వరుస హత్యలు చేస్తుంటాడు. దీంతో అతన్ని కాపాడిన డాక్టర్ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఆ డాక్టర్ ఎదుర్కొనే నైతిక సంఘర్షణ, దాని చుట్టూ జరిగే మిస్టరీ సంఘటనలే ఈ మాన్స్టర్ సిరీస్ కు హైలైట్.
ఇప్పుడు ధర్మన్ సినిమాలో కూడా రజినీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నారని వార్తలు రావడంతో, ఈ సిరీస్ కు సినిమాకు దగ్గరి పోలికలు ఉంటాయని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే, ఇది మాన్స్టర్ రీమేక్ అని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ఈ వార్తల్లో నిజమెంతో చిత్ర బృందం క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.