టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న గ్యాప్‌కి సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ రోజు(గురువారం) మార్నింగ్ సీఎం సారథ్యంలో టాలీవుడ్ పెద్దలతో కమాండ్ కంట్రోల్‌లో జరిగిన మీటింగ్ లో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చిత్ర పరిశ్రమ విషయంలో ప్రభుత్వం పాజిటివ్‌గా ఉందని, అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటుందని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ దిల్‌రాజు తెలిపారు. నెగటివ్ అంశాలు లేవని, అన్నీ పాజిటివ్‌గానే ఉన్నట్టు చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమని మరింతగా అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు సినీ పెద్దలు తెలిపారు.
అయితే ఇందులో అల్లు అర్జున్ మ్యాటర్ ప్రస్తావనకు రాలేదనట్టుగా తెలిపారు. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ విషయంలో సీఎం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఓ వార్త బయటకు వచ్చాయి. కానీ వాటిపై చర్చ జరగలేదని దిల్ రాజు తెలిపారు. తెలంగాణలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని, ఎఫ్‌డీసీ సారథ్యంలో అది జరిగేలా చూడాలని చెప్పారట. మరోవైపు తెలంగాణ సినిమా షూటింగ్‌లకు అనుకూలంగా ఉందని, ఇక్కడి టూరిజంని కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మీటింగ్ తో టాలీవుడ్‌కి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న గ్యాప్ తొలగిపోయినట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ మీటింగ్‌లో నాగార్జున కూడా పాల్గొన్నారు. ఆ మధ్య నాగ్‌కి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని హైడ్రా పేరుతో కూల్చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డికి నాగ్ శాలువా కప్పి అభినందించారు. నవ్వుతూ పలకరించారు. చూడబోతుంటే ఈ సమస్య కూడా సెటిల్ అయ్యి ఉంటుందనే చర్చ మొదలైంది. మీటింగ్ కి అటెండ్ అయిన వారు అంతా పాజిటివ్‌గానే ఉందని చెబుతున్నారు. కానీ ఇక్కడే మరో కోణం బయటకు వచ్చింది. `సోఫా` మ్యాటర్ తెరపైకి వస్తుంది.
వైఎస్‌ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. అటు టాలీవుడ్‌లో ఇటు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. ఆయన `పూర్తి పరిష్కారానికి సోఫాలు చేరాల్సిందే` అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ సమయంలో అంబటి రాంబాబు ఎందుకు ఈ ట్వీట్ వేశాడనేది పెద్ద చర్చ నడుస్తుంది. నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి కాకరేపే ప్రయత్నం చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ షేక్ అయ్యే ట్వీట్ అంటున్నారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ బిల్డింగ్‌లో ప్రభుత్వ పెద్దలతో సీఎం భేటీ అయిన నేపథ్యంలో దీనికి `సోఫా`కి లింక్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
`పుష్ప 2` సినిమాలో పుష్పరాజ్(అల్లు అర్జున్).. సీఎం తనని అవమానించడంతో అయన్నే మార్చేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం ఎమ్మెల్యేలను కొనేస్తాడు. వారికి కోట్లలో డబ్బులు `సోఫా`ల్లో పంపిస్తాడు. చివరికి సీఎంనే మార్చేస్తాడు. తాజాగా అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ని `పుష్ప 2` సినిమాలోని సోఫాలు పంపించే సీన్‌ని లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
తెలంగాణ సీఎంకి దీన్ని లింక్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ప్రభుత్వానికి సోఫాలు పంపిస్తేనే పూర్తి పరిష్కారం అవుతుందనే కోణంలో అంబటి రాంబాబు ట్వీట్ చేసినట్టుగా వక్రీకరిస్తున్నారు. తెగ వైరల్ చేస్తున్నారు. అంటే ఈ లెక్కని ప్రభుత్వానికి సినీ ప్రముఖులు సోఫాలు పంపిస్తే అన్ని సమస్యలు క్లీయర్ అవుతాయా? అనే చర్చని తెరపైకి తెస్తున్నారు.
అంబాటి రాంబాబు చేసిన ట్వీట్‌ని ఒక్కోలు ఒక్కోలా తీసుకుని రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ వివాదం గానీ, ఇండస్ట్రీతో ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ విషయంలో `సోఫా`తోనే పరిష్కారం అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అంబటి రాంబాబుకి కూడా కౌంటర్లు పడుతున్నాయి. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సినీ పెద్దలతో భేటీ అయ్యారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, త్రివిక్రమ్, దిల్ రాజు, ఆర్ నారాయణ మూర్తి, సురేష్ బాబు వంటి ప్రముఖులు వెళ్లారు. అప్పట్లో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించిన చర్చలు జరిపారు.
ఏపీకి ఇండస్ట్రీ రావాలని జగన్ ప్రభుత్వం కోరుకున్నట్టుగా తెలిపారు. అయితే అప్పుడు కూడా సోఫాలు పంపించారా? అని అంబటికి కౌంటర్ వేస్తున్నారు నెటిజన్లు. అప్పుడు జగన్‌కి సోఫాలు చేరితే ఇప్పుడు కూడా చేరతాయని అంటున్నారు. అంబటి ట్వీట్ ఇటు తెలంగాణలో కాకరేపితే, ఏపీకి సంబంధించి అంబటికే చెంపదెబ్బలా మారుతున్నాయి. వారికే రివర్స్ కొడుతున్నాయి. ఏదేమైనా ఆయన ట్వీట్ మాత్రం పెద్ద రచ్చ అవుతుందని చెప్పొచ్చు.
read more: పొలిటికల్ గేమ్‌లో అల్లు అర్జున్ బలిపశువా? వాటిని డైవర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి గేమ్ ? తెరవెనుక నిజాలు
also read: రేవంత్ రెడ్డితో మీటింగ్ :దిల్ రాజు ఆహ్వానించినా హాజరుకాని చిరంజీవి, ఎందుకంటే.. షాకింగ్ ట్విస్ట్