వెంకటేష్ వారసుడి ఎంట్రీ ఎప్పుడు..? ప్రస్తుతం వెంకీ తనయుడు ఏం చేస్తున్నాడంటే..

First Published | Dec 26, 2024, 6:47 PM IST

టాలీవుడ్ లో వరుసగా వారసుల ఎంట్రీలు జరుగుతున్నాయి. మరి విక్టరీ స్టార్ వెంటకేష్ తనయుడు ఎప్పుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు..? ఈ విషయంలో వెంకటేష్ ఏం కామెంట్ చేశాడు..? 

ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల వారసులు అందరు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొంత మంది స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతుంటే.. మరికొంత మంది మాత్రం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ కు నాలుగు స్థంబాల్లాగా స్టార్ డమ్ ను చూసిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. ఈనలుగురు ఇండస్ట్రీని నిలబెట్టారు. 

తెలుగు సినిమాలకు మకుటంలా నిలిచారు. అయితే ఈ నలుగురు స్టార్ హీరోల వారసులు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకువెళ్తున్నాడు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఇఫ్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాని నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికే పాన్ఇండియా స్టార్ గామారాడు. 
 


ఇక నాగార్జున ఇంటి నుంచి నాగచైతన్య, అఖిల్ హీరోగా కొనసాగుతున్నారు కాని స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు మిగిలి ఉంది వెంకటేష్ మాత్రమే. విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడు. వెంకీకి ముగ్గురు కూతుర్లు కాగా ఆతరువాత చివరివాడిగా అర్జున్ పుట్టాడు. దాంతో అతను చిన్నవాడు అవ్వడంతో ఇండస్ట్రీకి లేట్ అయ్యాడు. 

ప్రస్తుతం వెంకటేష్ తనయుడికి 20 ఏళ్లు కాగా పై చదవులు చదువుతున్నాడు. మరి ఫారెన్ చదువు అయిపోయిన తరువాత అతను ఇండస్ట్రీలోకి వస్తాడా లేదా అనేదానిపై వెంకటేష్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్గా బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సీజన్ 3 లో సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ కు వెంకటేష్ వచ్చారు. ఈక్రమంలో వీరి మధ్య వారసుల టాపిక్ వచ్చినట్టు తెలుస్తోంది. వెంకటేష్ తనయుడు అర్జున్ గురించి ప్రస్తావన వచ్చిందట. 
 

మరి అతను హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు అనేది వెంకటేష్ ఏం క్లారిటీ ఇచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. ఇటు వెంకటేష్ మాత్రం తనకు నప్పిన కథలను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా వెంకి నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈమూవీలో ఐశ్వర్యరాజేష్ హీరోయిన్ గా నటించింది. చాలా కాలం తరువాత రమణ గోకుల ఈసినిమాలో పాట కూడా పాడారు. ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Latest Videos

click me!