ఇలా ప్రతి సినిమాలోనూ దాన్ని ఫాలో అవుతున్నాడు. అయితే ప్రభాస్, రాజమౌళి ల మధ్య ఈ ప్రస్తావన వచ్చింది. అప్పుడు రాజమౌళి ఉండి, నువ్వే చెడగొట్టావ్‌గా అని ప్రభాస్‌ని అనడం విశేషం. మొత్తంగా ప్రభాస్ కారణంగా తనకు ఇష్టం లేని ఎలిమెంట్‌ని కూడా పెడుతూ హిట్లు కొడుతున్నారు రాజమౌళి.
ఆయన సినిమాల్లో లవ్ ట్రాక్‌లో ఉంటాయి, అలాగని మరీ అదే మెయిన్ కంటెంట్‌గా ఉండదు. ఓ బలమైన పాయింట్ బేస్డ్ గా సినిమాలు సాగుతుంటాయి. అందులో లవ్ స్టోరీ ఓ పార్ట్ గా ఉంటుంది. అయితే యూత్‌ని ఆకట్టుకునే అంశాల్లో లవ్ ట్రాక్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ తీస్తున్నారు. ఇందులో లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం.
ఇక ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా సాగబోతుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని ప్రారంభించబోతున్నట్టు ఇటీవల రైటర్ విజయేంద్రప్రసాద్ తెలిపిన విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ మూవీని సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.