ఏలూరు సమీపంలో గల ఓ గ్రామంలో పుట్టిన సిల్క్ స్మితకు పెద్దగా చదువు లేదు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బాల్యంలోనే వివాహం చేయడంతో అత్తింటివారి బాధలు తాళలేక ఇంట్లో ఉంది పారిపోయింది. అంచలంచెలుగా ఎదిగిన సిల్క్ స్మిత సౌత్ ఇండియాను ఏలింది. తక్కువ సమయంలో రెండు వందలకు పైగా చిత్రాల్లో సిల్క్ స్మిత నటించింది.
ఆమె మత్తు కళ్ళకు కుర్రకారు చిత్తైపోయింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని అనంతరం ఆ పొజిషన్ సిల్క్ స్మిత కైవసం చేసుకుంది. విలన్, వ్యాంప్, సపోర్టింగ్ రోల్స్ సైతం సిల్క్ స్మిత చేసింది. ప్రేమలో విఫలం చెందిన సిల్క్ స్మిత ఒంటరి తనాన్ని భరించలేకపోయింది. 1996లో ఆత్మహత్య చేసుకుంది.