Amala Akkineni: అమల సినిమాలకు ఎందుకు గుడ్‌ బై చెప్పిందో తెలుసా? నాగార్జున, ఏఎన్నార్‌ రూల్స్ కాదు, అసలు కారణమిదే

Published : Jul 24, 2026, 01:55 PM IST

అమల అక్కినేని సినిమాలు మానేసి చాలా ఏళ్లు అవుతుంది. అయితే మధ్యలో రెండు మూడు క్యారెక్టర్స్ చేసింది. అయితే తాను సినిమాలు మానేయడానికి కారణం ఏంటో చెప్పింది అమల.

PREV
15
పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పిన అమల

అమల అక్కినేని ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ తో ఆడిపాడారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతో రొమాన్స్ చేసి మెప్పించారు. అప్పట్లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణించారు. అయితే పెళ్లికి ముందు తిరుగులేని ఇమేజ్‌తో రన్‌ అయిన అమల.. నాగార్జునతో పెళ్ళి తర్వాత సినిమాలు మానేసింది. కేవలం ఫ్యామిలీకే పరిమితమయ్యింది.

25
అమల సినిమాలు మానేయడానికి అక్కినేని ఫ్యామిలీనే కారణమా?

అమల సినిమాలకు గుడ్‌ బై చెప్పడానికి సాధారణంగా కుటుంబ కట్టుబాట్లు, ఫ్యామిలీ పెట్టిన రూల్స్ కారణం అనుకుంటారు. ఫ్యామిలీని చూసుకోవడం కోసమే సినిమాలు మానేశారని అంతా అనుకుంటారు. ఈ విషయంలో భర్త నాగార్జునగానీ, మామయ్య అక్కినేని నాగేశ్వరరావుగానీ రూల్స్ పెట్టి ఉంటారనే థాట్‌ కూడా వస్తుంది. కానీ తాను ఎందుకు సినిమాలు మానేసిందో తాజాగా అమల చెప్పారు. ఆమె ఇన్నాళ్లకి ఓపెన్‌ అయ్యారు. అసలు కారణం వెల్లడించారు.

35
కెమెరాకి బ్రేక్‌ ఇవ్వడానికి కారణమిదే

అమల కెరీర్‌ బిగినింగ్‌లో సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి చిత్రాల్లో నటించింది. దాదాపు ఏడెనిమిదేళ్లు తీరిక లేకుండా గడిపింది. మార్నింగ్‌ 8-9గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు వర్క్ చేసేదట. ఏక కాలంలో రెండు మూడు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొనాల్సి వచ్చేదట. ఇక బయటప ప్రపంచం ఏంటో తెలియకుండా గడిపిందట. ఈ క్రమంలో చాలా ఒత్తిడికి గురైనట్టు తెలిపింది అమల. కెమెరాకి కొంత బ్రేక్‌ తీసుకొని ట్రావెలింగ్‌ ప్లాన్‌ చేసిందట. ఈ క్రమంలో బయట ప్రపంచంలో ఆమె చాలా విషయాలు చూసింది. ముఖ్యంగా యానిమల్స్ విషయంలో ఆమె చలించిపోయిందట.

45
జంతువుల కోసమే సినిమాలకు గుడ్‌ బై

జంతువులను హింసించడం, చాలా జంతువులు రోడ్ల పక్కన చనిపోయి కనిపించడం, కొన్ని ఏరియాల్లో పాములకు మౌత్‌ కుట్టేయడం, ఇతర జంతువులను బంధీగా ఉంచడం, కొన్ని జంతువులు ఫుడ్‌ లేని స్థితిలో చూడటం ఇలాంటి అనేక సంఘటనలను తన జర్నీలో చూసింది. వాటి కోసం ఫైట్‌ చేయాలనిపించిందట. ప్రభుత్వ అధికారులను కలవడం, ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ విషయాలపై చర్యలు తీసుకోవాలని చెప్పిందట. ఈ క్రమంలో బాగా తిరిగిందట. అప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులు చూసి తాను కెమెరా ముందు కాదు, ఇలా బయట చేయాల్సింది చాలా ఉందని, తనని తాను తెలుసుకునేది చాలా ఉందని, ప్రపంచం గురించి తెలుసుకోవాలని చెప్పి క్రమంగా ఆమె సినిమాలు తగ్గించిందట. ఈ క్రమంలో సినిమాల కంటే ఇలాంటి యాక్టివిటీస్‌తోనే బిజీ అయిపోయిందట. ఆ సమయంలో నాగార్జున కూడా ఆమె సినిమాలు కంటే ఇలా తిరిగే విషయాల్లోనే బిజీగా ఉందని కామెంట్‌ కూడా చేసేవారట.

55
బ్లూ క్రాస్‌ హైదరాబాద్‌ కి కో ఫౌండర్‌గా అమల

తెరపై కాదు, తెరవెనుక చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, సమాజంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి అమల సినిమాలకు గుడ్‌ బై చెప్పిందట. ఆ తర్వాత నుంచి ఆమె బ్లూ క్రాస్‌ హైదరాబాద్‌ అనే ఎన్జీవోని స్థాపించి, దానికి కో ఫౌండర్‌గా వ్యవహరిస్తూ, యానిమర్స్ రక్షణ, వాటి రైట్స్ కోసం పోరాడుతుంది. అనేక యాక్టివిటీస్‌ చేస్తుంది. ఇక ఫ్యామిలీ, పిల్లల్ని చూసుకోవడంతో బిజీ అవుతుంది. అయితే మధ్యలో కూడా ఒకటి అర సినిమాలు చేసింది. మేకర్స్ ఒత్తిడి మేరకు మధ్యలో `లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌`, `మనం`, `ఒకే ఒక జీవితం` వవంటి చిత్రాల్లో మెరిసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories