Jana Nayagan: విజయ్ నటుడు కాదు, ఒక ఎమోషన్.. అభిమానులను కంటతడి పెట్టిస్తున్న వీడియో వైరల్

Published : Jul 24, 2026, 01:07 PM IST

సౌత్ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా 'జననాయగన్' ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చివర్లో ప్రదర్శించిన ఒక ప్రత్యేక వీడియో, అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఇంతకీ ఏంటా వీడియో?

PREV
14
సత్తా చాటిన దళపతి విజయ్..

ఎన్నో ఏళ్ల నిరీక్షణ, న్యాయపోరాటాలు, అడ్డంకులను దాటుకుని నటుడు విజయ్ చివరి సినిమా 'జననాయగన్' థియేటర్లలో విడుదలైంది. ఒకప్పుడు హేళన చేసిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకున్న విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పారు. పక్కా విజయ్ మార్క్ అంశాలతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలోనే, అభిమానులను, సోషల్ మీడియా యూజర్లను కంటతడి పెట్టిస్తున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

24
కంటతడి పెట్టిన దళపతి అభిమానులు

'జననాయగన్' సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో ఈ వీడియోను ప్లే చేశారు. సినిమా చూసిన వారికి ఇది ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లా అనిపించింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన చాలామంది అభిమానులు కన్నీళ్లతో కనిపించారు. విజయ్ పాత సినిమాల క్లిప్పింగ్స్, 'జననాయగన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలను ఈ వీడియోలో చూపించారు. 'ఆయన కేవలం నటుడు కాదు, ఒక ఎమోషన్' అనే క్యాప్షన్‌తో చాలామంది ఈ 1 నిమిషం 8 సెకన్ల వీడియోను షేర్ చేస్తున్నారు.

34
వెల్లువెత్తుతున్న కామెంట్స్

విజయ్‌పై తమకున్న ప్రేమను అభిమానులు కామెంట్ల రూపంలో కురిపిస్తున్నారు. "ఈ రోజుతో వెండితెరపై నా చిన్నతనం ముగిసింది. కానీ నా హీరో నా గుండెల్లోంచి ఎప్పటికీ వెళ్ళిపోడు", "పదేళ్ల తర్వాత అడిగినా, నా ఫేవరెట్ హీరో విజయ్ మాత్రమే", "30 ఏళ్ల జ్ఞాపకాలు... ఈ వీడియో చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా", "ఒక నటుడిగా ఆయన ప్రయాణం ముగిసి ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిగా, నిజమైన హీరోగా ఆయన తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

44
పొంగల్‌కు రిలీజై ఉంటే....

ఈ సినిమాను చూసిన చాలామంది ఆడియన్స్  ఫీల్ అవుతున్న మరో విషయం ఏంటంటే, ఈ సినిమా పొంగల్‌కు విడుదలై ఉంటే విజయ్ రాజకీయాలకు పెద్ద బూస్ట్ ఇచ్చేదని అంటున్నారు. అప్పుడు రిలీజైతే, విజయ్ 150 సీట్లు కూడా గెలిచేవారని అభిప్రాయపడుతున్నారు. అయితే, కొందరు మాత్రం సినిమాను అప్పుడు అడ్డుకున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే, అప్పుడు రిలీజైతే ఇది కేవలం 'దళపతి' సినిమాగా ఉండేది. కానీ ఇప్పుడు 'గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్' సినిమాగా వచ్చింది. MGR తర్వాత, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నటుడి సినిమా రిలీజ్ అవ్వడం విజయ్‌తోనే సాధ్యమైంది.

Read more Photos on
click me!

Recommended Stories