దళపతి విజయ్ ప్లేస్ పై కన్నేసిన అల్లు అర్జున్ ? ఐకాన్ స్టార్ మాస్టర్ ప్లాన్ మూమూలుగా లేదుగా?

Published : Jan 17, 2026, 12:47 PM IST

ఐకాస్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్ గా మరో తమిళ స్టార్ డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. వరుసగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నాడు. అయితే ఈ నిర్ణయాల వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

PREV
16
తమిళ దర్శకులతో తెలగు హీరోలు..

ఈమధ్య కాలంలో భాషా బేధాలు లేకుండా.. దర్శకులు, హీరోలు పనిచేస్తున్నారు. తెలుగు దర్శకులతో తమిళ హీరోలు, తమిళ దర్శకులతో తెలుగు హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతుండగా.. స్టార్ హీరోలు మాత్రం రీసెంట్ గానే ఈ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. అన్ని భాషల్లో భారీగా అభిమానులు సంపాదించుకనే పనిలో ఉన్నారు. అందుకే ఇతర భాషల్లో ఉన్న స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఇంకాస్త ముందడుగు వేశాడు.

26
పాన్ ఇండియాను ఏలుతున్న అల్లు అర్జున్..

మొన్నటి వరకూ టాలీవుడ్‌కే పరిమితం అయిన అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియాను ఏలుతున్నాడు. పుష్ప రెండు సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కీలక స్థానాన్ని ఆయన సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇటీవల ‘పుష్ప 2’ సినిమాతో భారీ రికార్డులను సృష్టించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. 

‘పుష్ప 2’ సక్సెస్ తో బన్నీ క్రేజ్ నార్త్ లో సౌత్ లో భారీగా పెరిగింది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా బన్నీ ఇమేజ్ డబుల్ అయ్యింది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్ అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. . యూత్ అంతా బన్నీ ఫ్యాషన్ ను బాగా పాలో అవుతుంటారు. ఇక పుష్ప సినిమాతో నార్త్ లో కూడా పాగా వేశాడు అల్లు అర్జున్.

36
తమిళ దర్శకులతో ఐకాన్ స్టార్ సినిమాలు..

పుష్ప3 కి లాంగ్ గ్యాప్ ఇచ్చి.. అల్లు అర్జున్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. సూపర్ మాన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమా ఇండియన్ సినిమాలో అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందనే నమ్మకంతో అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ద్వారా తన అభిమానులను భారీ స్థాయిలో పెంచుకునే ప్లాన్ చేశాడు బన్నీ. అట్లీ సినిమా షూటింగ్ నడుస్తుండగానే..మరో తమిళ స్టార్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఐకాన్ స్టార్.

46
లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ 23వ సినిమా..

రీసెంట్ గా సంక్రాంతి కానుకగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు బన్నీ. మరో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. #AALoki, #AA23, #LK7 వర్కింగ్ టైటిల్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. వైవిధ్యమైన కథలు, బలమైన మేకింగ్ తో సినిమాలను రూపొందించడంలో లోకేష్ కనకరాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత సంవత్సరం రజనీకాంత్‌తో చేసిన ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ, లోకేష్ మేకింగ్ స్టైల్‌కు మాత్రం మంచి ప్రశంసలు లభించాయి. దాంతో ఇప్రెస్ అయిన అల్లు అర్జున్ ఈ అవకాశం ఇచ్చినట్టు సమాచారం.

56
దళపతి విజయ్ ప్లేస్ పై కన్నేశాడా?

తమిళంలో మంచి పేరున్న యంగ్ డైరెక్టర్స్ ను ఎంచుకుని మరీ సినిమాలు ప్రకటిస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు సినిమాలు చేస్తున్న ఇద్దరు దర్శకులకు సెపరేట్ ఇమేజ్ ఉంది. వీరితోసినిమాలు చేస్తే.. గ్యారెంటీ ఉంటుంది. తమిళనాడులో మంచి ఇమేజ్ కూడా వస్తుంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్ కు మంచి ఇహేజ్ ఉంది. అక్కడ బన్నీకి పోటీగా మరో హీరో ఉన్నాడంటే అది విజయ్ దళపతినే. 

ఇక విజయ్ దళపతి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిండంతో.. కేరళలో ఐకాన్ స్టార్ కు తిరుగుండదు. ఇక తమిళంలో కూడా విజయ్ రేంజ్ లో స్టార్ డమ్ కోసం అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కానీ.. అట్లీ, లోకేష్ సినిమాలు కంప్లీట్ అయ్యే సరికి అల్లు అర్జున్ను పట్టుకోవడం ఇక కష్టమే అవుతుంది.

66
తమిళ దర్శకులే ఎందుకు?

అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మంది స్టార్ దర్శకులు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ వరుసగా తమిళ దర్శకులతోనే సినిమాలు ఎందుకు చేస్తున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. సమాచారం ప్రకారం, పలువురు తెలుగు దర్శకులు అల్లు అర్జున్‌కు కథలు వినిపించినప్పటికీ, ఆయనకు అవి నచ్చలేదని తెలుస్తోంది. మరోవైపు, తమిళ్ ఇండస్ట్రీలోని దర్శకులు మేకింగ్ మీద గట్టి పట్టుతో కథలను తెరపైకి తీసుకువచ్చే విధానం అల్లు అర్జున్‌ను ఆకట్టుకుంటోందని ప్రచారం జరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories