అల్లు అర్జున్ చేతిలో చెంప దెబ్బతిన్న సీనియర్ నటుడు, బన్నీ గురించి ఏం చెప్పాడో తెలుసా?

Published : Oct 02, 2025, 11:14 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతోన్న అల్లు అర్జున్, ఎంతో మంది సీనియర్ స్టార్స్ తో కలిసి నటించి మెప్పించారు. అయితే ఆయన ఓ స్టార్ సీనియర్ నటుడి చెంప చెళ్లుమనిపించాడని మీకు తెలుసా? 

PREV
15
పాన్ ఇండియా హీరో

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. గతంలో సౌత్ కే పరిమితం అయిన బన్నీ ఇమేజ్ ప్రస్తుతం నార్త్ కు కూడా పాకింది. అక్కడ కూడా అల్లు అర్జున్ కు వీరాభిమానులు తయారయ్యారు. ఐకాన్ స్టార్ కు హిందీలో కూడా అభిమాన సంఘాలు పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ ఇమేజ్ కోసం భారీగా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. అందుకోసం అట్లీతో చేతులు కలిపాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో సినిమాస్టార్ట్అయ్యింది. ఈసినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈసినిమా తెరకెక్కతోంది.

25
సీనియర్ నటుడి చెంప చెళ్ళుమనిపించిన బన్నీ

అల్లు అర్జున్ కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. సీనియర్ నటులను ఎంతో గౌరవిస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, జూనియర్ ఆర్టిస్ట్ లను కూడా అల్లు అర్జున్ చాలా అభిమానంగా ఉంటారు. అయితే ఓ సందర్భంలో బన్నీ ఓ ఆర్టిస్ట్ చెంప చెళ్లుమనిపించారట. ఆ దెబ్బకు ఆయన కళ్లజోడు కిందపడి పగిలిపోయిందట. అంతే కాదు అప్పుడు అల్లు అర్జున్ చేసిన పని తలుచుకుని ఆ సీనియర్ నటుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో కాదు జెన్నీ.

35
వెండితెరపై 500, బుల్లితెరపై 1000

జెన్నీ పేరు చెపితే గుర్తు పట్టరేమో కాని.. వెండితెరపై ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రల్లో మాత్రం ఆయన చాలా ఫేమస్. దాదాపు50 ఏళ్లుగా గా ఆయన సినిమా రంగంలో ఉన్నారు. జెన్నీ అసలు పేరు పోలాప్రగడ జనార్ధనరావు. 500 కు పైగా సినిమాలు, 1000 కి పైగా టెలివిజన్ కార్యక్రమాలు, సీరియల్స్ లో ఆయన నటించారు. ఆయన స్టార్ హీరోల సినిమాల్లో అలా కనిపిస్తూ.. మెరుస్తుంటారు. ఈక్రమంలో ఆయన ఓ సినిమాలో అల్లు అర్జున్ తో ఓ చెంపదెబ్బ తినే సన్నివేశం ఉంటుంది. దాని గురించి జెన్నీ వివరిస్తూ.. ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెళ్లడించారు.

45
పగిలిపోయిన జెన్నీ కళ్లజోడు

రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ ను ఎగతాళి చేసే సీన్ ఉంటుంది. అందులో అల్లు అర్జున్ కోపం తట్టుకోలేక ఆయనను చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ చేశారు, అల్లు అర్జున్ సీనియన్ నటుడిని చెంపపై కొట్టాడు, టేక్ ఒకే అయ్యింది. కానీ బన్నీ కొట్టిన ఫోర్స్ కు, ఆయన వేలు జెన్నీ కళ్లజోడికి తగిలి అది కింద పగిడి పగిలిపోయింది. అయితే ఆతరువాత అల్లు అర్జున్ స్పందించిన తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని జెన్నీ వెల్లడించారు.

55
అల్లు అర్జున్ ఏం చేశారు?

జెన్నీ కళ్లజోడు కింద పడి పగిలిపోవడంతో వెంటనే స్పందించిన అల్లు అర్జున్.. జెన్నీకి సారి చెప్పాడట. పర్లేదండి, అనుకోకుండా జరిగింది కదా అని జెన్నీ అంటే.. వెంటనే తన అసిస్టెంట్ ను పిలిచి, ఆయనకు కొత్త కళ్ల జోడు ఇప్పించండి, వెంటనే ఆ పనిచేయండి అని చెప్పారట. కానీ జెన్నీ మాత్రం వద్దు అన్నారట. కానీ అల్లు అర్జున్ మాత్రం అదేంటండి నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. మీరంటే నాకు ఎంతో గౌరవం. మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే అని అన్నారట. అప్పుడు. జెన్నీ మీరు ఇచ్చిన కళ్లజోడు తీసుకుంటాను, కానీ నాదో చిన్న రిక్వెస్ట్ అని అడిగారట. మీరు నటించిన ప్రతీ సినిమాలో ఓ చిన్న వేశం ఇవ్వండి చాలు అని అడిగారట జెన్నీ. దానికి అల్లు అర్జున్ తప్పకుండా ఇస్తాను. యూ డిజర్వ్డ్ ఇటు అంటూ మాట ఇచ్చారట. ఆ తరువాత తన మేనేజర్ తో పంపించి కొత్త కళ్లజోరు ఇప్పించారట అల్లు అర్జున్. ఈ విషయాన్ని జెన్నీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories