
సినిమాల ఫస్ట్ షోలకే సోషల్ మీడియా మినిట్ బై మినిట్స్ రివ్యూలు పెడుతున్నారు చాలా మంది సోషల్ మీడియా హ్యాండిల్స్. ఇందులో కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. వారికి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తమ ఊసురు తగిలిపోతారని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. తమ కష్టం ఎవరికీ తెలియదన్నారు. ఆయన హీరోగా నటించిన `ఓజీ` మూవీ గత వారం విడుదలై విజయవంతంగా రన్ అవుతుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, తేజ్ సప్రూ, హరీష్ ఉత్తమన్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్‌ని బుధవారం హైదారబాద్‌లో నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పైరసీ గురించి, సినిమాని చంపేసే సోషల్ మీడియా పోస్ట్ ల గురించి, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ వార్ గురించి మాట్లాడారు. వారికి తనదైన స్టయిల్‌లో వార్నింగ్ ఇచ్చారు.
చిత్ర టీమ్ అందరికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, `అందరు హీరోల అభిమానులను తాను కోరుకునేది ఒక్కటే. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, రవితేజ.. ఏ హీరో అయినా, ఏ భాష హీరో అయినా, వారి వర్క్ ని గౌరవించండి, ఆదరించండి. నేను ఆర్ట్ ని ప్రేమించేవాడిని. ఇంకో హీరోని ద్వేషిస్తున్నారంటే నాకు మనసు సరిగా ఉండదు. ఈ సందర్భంగా అందరు హీరోల అభిమానులకు, నా అభిమానులకు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాన్స్ వార్ గొడవలను ఆపేయండి. మేం ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు ఏం తెలుసు. ఎన్ని నిద్ర లేని రాత్రులు, ఎన్ని రోజులు ఇంటికి వెళ్లకుండా పనిచేస్తామో మీకు తెలియదు. ఇళ్లల్లో ఎన్ని తిట్లు తింటామో తెలియదు. సుజీత్ నెలన్నరగా తన భార్యని, పిల్లల్ని చూడలేదు. ఈ ఫ్యాన్స్ వార్ లో పడి దయజేసి సినిమాని చంపేయకండి. ఇప్పుడు సినిమా లైఫ్ తగ్గిపోయింది. ఒకప్పుడు వంద రోజులు, 150 రోజులు ఆడేవి. అప్పుడే సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆరు రోజులకే పరిమితమయ్యింది. ఈ ఫ్యాన్స్ వార్‌ని ఆపి, ఇతర హీరోల సినిమాలని కూడా అభినందించండి. అది కాకుండా ఇలా లేదు, అలా లేదు, చూడకూడని తిట్టుకుంటుంటే సోసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. ఎవరు ఎంత మారతారు అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. నేను అందరి హీరోల అభిమానులను, ప్రేక్షకులను గౌరవిస్తాను. మంచి సినిమాలను అభినందిద్దాం, ఆదరిద్దాం` అని చెప్పారు.
ఆయన ఇంకా చెబుతూ సోషల్ మీడియా రివ్యూవర్స్ ని ఏకిపడేశారు. `సోషల్ మీడియా హ్యాండిల్స్ కి, యూట్యూబర్స్ కి నా రిక్వెస్ట్. సినిమా స్టార్ట్ అయ్యే లోపే ఆ స్టార్ట్ అయ్యింది. ఈ షాట్ బాలేదు. ఇప్పుడు ఇది అయ్యిందని పెడుతున్నారు. అసలు సినిమా బాగుందా లేదా అనేది రెండున్నరగంటలు చూడండి. ఇప్పుడు అందరు సినిమాని చూడటం మానేసి రివ్యూవర్స్ గా తయారయ్యారు. ఈ కల్చర్ ఎక్కడో ఒక చోట పోవాలి. పెరుగుడు విరుగుడు కొరకే. సినిమాకి కోట్లు ఖర్చు చేస్తాం. నేను `హరి హర వీరమల్లు`కి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. `అత్తారింటికి దారేదీ` సినిమా ఏడాదిన్నగా కష్టపడి చేస్తే, నెట్‌లో రిలీజ్ అయితే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. నలభై, యాభై కోట్లు వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం. ఆ సినిమా సమయంలో నేను పెట్టిన సంతకాలకు `కాటమరాయుడు` వరకు కడుతూనే ఉన్నా. ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలి. బయటకు చూడ్డానికి వెలుగులు, జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోధనగా ఉంటుందో ఎవరికీ తెలియదు. పైరసీ చేయడం ఈజీ, కానీ మా కష్టాలు తెలియదు. మీరు ఎత మంది పొట్టగొడుతున్నారో మీకు తెలయడం లేదు, మా ఉసురు తగిలేస్తుంది, మా ఏడుపులు తగిలేస్తాయి జాగ్రత్త. సినిమాని కక్ష్య కట్టి చంపేస్తే, చాలా మంది కడుపుకోత, ఆకలి మిమ్మల్ని వెంటాడుతుంది. నిర్మాతలు సినిమాలు చేయడానికి బయపడి పారిపోతారు. సినిమాల విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నామో నాకు తెలుసు. `హరి హర వీరమల్లు` మూవీ ఇబ్బందులను ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నాను` అని తెలిపారు పవన్ కళ్యాణ్.
ఈ వేడుకలో సినిమా సక్సెస్ గురించి, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల గురించి పవన్ కళ్యాణ్ చెబుతూ, `ఓజీ సినిమా మా అందరికి చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, గ్రేట్ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ, ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అవ్వడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం మాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఒక సినిమా సుజిత్ ద్వారా నాకు రావడం. దానికి తమన్ జీవం పోయడం, రవి కె చంద్రన్ ఫోటోగ్రఫీ అందివ్వడం. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, డీవీవీ దానయ్య ఇలా ఈ సినిమా గొప్పగా రావడానికి కారణమైన అందరికీ కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఒక సినిమా కథని రాయడం, చెప్పడం చాలా ఈజీ.. కానీ రాసిన కథను తెర మీదకు అలాగే తీసుకురావడం చాలా కష్టం. ఎందుకు అంటే డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలి. అది ఓజీ విషయంలో జరిగింద`న్నారు.
ఇంకా మాట్లాడుతూ, `మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఇప్పటి వరుకు ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలీదు. త్రివిక్రమ్ నేను మాట్లాడుకుంటున్నపుడు సుజిత్ టాపిక్ వచ్చింది. అలా ఓజీ స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఒక కత్తి పట్టుకుని జపానీస్ డ్రెస్ లో ఉంటారు. గన్స్ ఉంటాయి, మీరు ఒక గ్యాంగ్ స్టర్. ఇలాగే చెప్పాడు కథ, నాకు ఏం అర్థం కాలేదు. కానీ సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్ ను మా అబ్బాయి అకీరా నందన్ చదువుతూ చాలా ఆనందం పడుతూ ఉండేవాడు. అప్పుడు అనిపించింది, ఈ తరం వాళ్ళకి అర్థం అయ్యే కథే ఓజీ సినిమా అని. కొన్ని సార్లు సుజిత్ లో నన్ను నేను చూసుకుంటా. ఎందుకు అంటే కొన్ని సార్లు మనం చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోవచ్చు, కానీ చేసి చూపించగలం అని నేను బాగా నమ్ముతా. అది సుజిత్ లో నాకు కనిపించింది. అందుకే సుజిత్ కి నేను ఒక మాట ఇచ్చాను. ఓజీ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ మనం చేస్తున్నాం అని. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు. కానీ ఓజీ సినిమా నాకు మళ్లీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చింది. కాబట్టి నాకు ఉన్న సమయం లో ఓజి యూనివర్స్ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం నన్ను తమ్ముడు సినిమా రోజులకి తీసుకువెళ్లింది. అలాగే అర్జున్ దాస్ అతని చూసినపుడు నేను చాలా ఫీల్ అవుతాను అలాంటి గొంతు నాకు లేదు అని. ఓజీ యూనివర్స్ లో భాగం అయిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు` అని అన్నారు.