అల్లు అర్జున్ ఇంటి దగ్గర భయంకర పరిస్థితి, ఫ్యాన్స్ కు బన్నీ వార్నింగ్.. పిల్లల్ని అత్తగారింటికి పంపిన హీరో

First Published | Dec 22, 2024, 9:27 PM IST

అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితి ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఉద్రిక్తత వారావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పాడింది. దాంతో  ఐకాన్ స్టార్ అలర్ట్ అయ్యారు. 

అల్లు అర్జున్ వివాదానికి సబంధించిన హీట్ కొనసాగుతూనే ఉంది. అసెబ్లీల్ రేవంత ప్రకటన తరువాత..బన్నీ ప్రెస్ మీట్, పోలీసుల క్లారిటీతో.. ఒక్క సారిగా ఉద్రిక్తత పెరిగిపోయింది. అల్లు అర్జున్ తప్పును ఎత్తి చూపుతూ.. సాక్ష్యాలతో సహా  పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడంతో.. అల్లు అర్జున్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈక్రమంలోనే తాజాగా ఓయూ జేఏసీ  నేతలు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. దాంతో అక్కడ వాతావరణ మారిపోయింది. 

Also Read: రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, డేంజర్ లో గేమ్ ఛేంజర్, రంగంలోకి మెగాస్టార్..?

అంతే కాదు అల్లు అర్జున్ఇంటి గోడ దూకి.. లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు.. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ వారిని అడ్డుకునే ప్రనయత్నం చేయగా.. వారిని చితకబాదారు. అంతే కాదు బన్నీ ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు.. అక్కడ పూల కుండీలను కూడా పగలగొట్టారు. దాంతో అల్లు ఫ్యామిలీతో పాటు..చుట్టుపక్కల వారు కూడా భయబ్రాంతులకు గురయ్యారు. దాంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈ సారి చాలా త్వరగా స్టార్ట్ కాబోతున్న రియాల్టీషో.. ఎప్పుడంటే..?
 


allu arjun

మరణించిన రేవతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని.. వారు డిమాండ్ చేశారు. అయితే ఈ దాడి చేసిన వారు ఉస్మానియాకు చెందిన జేఏసీ నేతలుగా తెలుస్తోంది. అయితే ఈ సంఘటనజరిగినప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో స్నేహారెడ్డి, పిల్లలు, ఇంట్లో పెద్దవారు కూడా ఉన్నారు. వారి ఈ పరిస్థితి చూసి భయపడిపోయారు. ఇక బన్నీ ఈ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో లేరు. 

Also Read: నన్ను పనిచేసుకోనివ్వండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్..

దాంతో స్నేహారెడ్డి తండ్రికి ఫోన్ చేసి.. పిల్లలను తన అత్తగారింటికి పంపించారు అల్లు అర్జున్. పిలలను కారులో పంపిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పరిస్థితి గురించి తెలియడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఎత్తును బన్నీ ఇంటికి చేరుకునే ప్రనయత్నం చేశారు. వారిని పోలీసులు వారించి పంపించేశారు. అయితే ఈ దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు అల్లు అర్జున్ ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. 

ఈ విషయంలో అల్లు అరవింద్ కూడా స్పందించారు. మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. పోలీసులు కేసు పెట్టారు. మా ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్లను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మేం కూడా సంయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని కోరారు.

అలు అల్లు అర్జున్ కూడాతన ఫ్యాన్స్ కు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ ఇష్యూ గురించి ఎటువంటిపోస్ట్ లు పెట్టవంద్దని. ఏమాత్రం నోరు జారిమాట్లాడవద్దు అని తన ఎక్స్ పోస్ట్ లో తెలిపారు అల్లు అర్జున్. ఫ్యాన్స్ ముసుగులో కొంత మంది రాంగ్ పోస్ట్ లు పెట్టి.. తనను ఇరికించే ప్రయత్నం చేశారని.. వారిపై కంప్లైంట్ ఇచ్చాన్నారు.

ఇక ఫ్యాన్స్ ఎవరైనా రాంగ్ పోస్ట్ లు పెట్టడం. ఇతరులను విమర్శిస్తు.. తన ఇష్యూను అందులో లాగే ప్రయత్నం చేస్తే.. చర్యలు తప్పవన్నారు అల్లు అర్జున్. ఇక ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో తెలియడంలేదు.  ఉద్రిక్త పరిస్థితులు సర్ధుమణగటానికి టైమ్ పట్టే అవకాశం ఉంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్.. అల్లు అర్జున్ కౌంటర్ ప్రెస్ మీట్, ఆతరువాత పోలీసులు సాక్ష్యాలతో సహా మరో ప్రెస్ మీట్ పెట్టడంతో పరిస్థతి మారిపోయింది. 

Latest Videos

click me!