దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది కాంతార చాప్టర్ 1 మూవీ. ఈసినిమాపై కాస్త లేట్ గా స్పందించారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈసినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ సినిమాపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్ అంతా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వస్తున్నారు. అద్భుతమైన సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈక్రమంలో ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. రీసెంట్ గా ఈసినిమాను చూసిన ఐకాన్ స్టార్.. ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
24
మైండ్‌బ్లోయింగ్ సినిమా
అల్లు అర్జున్ తన పోస్ట్‌లో ఇలా రాశారు, “నిన్న రాత్రి ‘కాంతార’ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను. మైండ్ బ్లోయింగ్ సినిమా చూశాను, సినిమా చూసేంతసేపు ఒక ప్రత్యేక అనుభూతిలో మునిగిపోయాను' అని అల్లు అర్జున్ తెలిపారు.” ఈ సందర్భంగా బన్నీ ఈసినిమా రచయిత, దర్శకుడు, రిషబ్ శెట్టిపై ప్రశంసల జల్లు కురిపించారు. “రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు” అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.
34
మాటలు సరిపోవడంలేదు..
ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరిని అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. వారి నటనను, పనితీరును ప్రశంసించారు. “రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్య నటన అద్భుతంగా ఉంది” సంగీత దర్శకుడు అజనీశ్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ ధరణి గంగే, స్టంట్ మాస్టర్ అర్జున్ రాజ్ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాదు ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నిర్మాత విజయ్ కిరగందూర్, హోంబలే ఫిలిమ్స్ బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. “నిజాయతీగా చెప్పాలంటే, ‘కాంతార’ అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదు” అంటూ తన పోస్ట్ లో చివరి మాటగా రాశారు ఐకాన్ స్టార్.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా చిత్రంలోని స్థానిక సంస్కృతి, దైవ భక్తి, ప్రకృతి నేపథ్య అంశాలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. అంతేకాకుండా, కాంతార బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. త్వరలో 1000 కోట్ల మార్క్ దాటుతుందని టీమ్ నమ్ముతున్నారు. కేజీయఫ్ తరువాత కన్నడ సినిమాను జాతీయ స్థాయిలో మరోసారి నిలిపిన సినిమాగా కాంతార చాప్టర్ 1 గుర్తింపు తెచ్చుకుంది.