బెట్టు కట్టి డబ్బులు పోగొట్టుకున్న శోభన్ బాబు, స్టార్ హీరో ను ఓడించిన వ్యక్తి ఎవరో తెలుసా?

Published : Oct 24, 2025, 03:47 PM IST

శోభన్ బాబు అంటే ఆర్ధిక క్రమశిక్షణకు మారు పేరు అంటుంటారు. అటువంటి వ్యక్తి బెట్టు కట్టి డబ్బులు పోగొట్టుకున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఇందులో నిజం ఎంత? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

PREV
14
క్రమశిక్షణకు మారుపేరు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ధిక క్రమశిక్షణకు శోభన్ బాబు పెట్టింది పేరు. కెరీర్ బిగినింగ్ లో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిన శోభన్ బాబు.. ఆతరువాత కాలంలో డబ్బు విలువ తెలుసుకుని, జాగ్రత్త చేయడం స్టార్ట్ చేశారు. తాను సబంధించిన డబ్బులో ఎక్కువ శాతం భూములు కొనడానికి ఉపయోగించారు శోభన్ బాబు. అందుకే ప్రస్తుతం చెన్నైలో సగం భుములు ఆయనవే అని అంటుంటారు. అంతే కాదు ఆర్దికంగా క్రమశిక్షణ పాటించారు కాబట్టే.. శోభన్ బాబు దాదాపు 5000కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని సమాచారం.

24
అపాత్రదానంచేయరు .

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది శోభన్ బాబును పిసినారి అని అంటుంటారు. కానీ ఆయన కట్లుబాట్ల గురించి సీనియర్ నటుడు దివంగత కృష్ణంరాజు గతంలో ఓ విషయాన్ని వెల్లడించారు. శోభన్ బాబు పిసినారి కాదు.. అనవసరంగా ఖర్చు పెట్టడు అంతే.. కానీ అవసరం ఉంది అనుకుంటే దానికంటే ఎక్కువే ఖర్చు చేస్తాడు. అవనసరంగా మాట్లాడడు, అవసరంగా దానం చేయడు, అనవసరంగా ఎవరితో కలవడు, అది ఆయనకు ఉన్న అలవాటు. అని కృష్ణంరాజు వెల్లడించారు.

34
బెట్ కట్టి డబ్బులు పోగొట్టుకున్న శోభన్ బాబు.

శోభన్ బాబు నచ్చితేనే మాట్లాడతారు.బాగా క్లోజ్ గా ఉన్న వ్యక్తులతోనే ఎక్కువ మూవ్ అవుతారు. లేకపోతే షూటింగ్ లో కామ్ గా ఓ పక్కకు కూర్చుని అన్నీ గమనిస్తుంటారు. అయితే అప్పట్లో ప్రేమ్ కుమార్ అనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవరు. ఆయనతో శోభన్ బాబు చాలా క్లోజ్ గా ఉండేవారు. ప్రేమ్ కుమార్ దగ్గర డబ్బులు లేకపోతే, శోభన్ బాబు దగ్గర ఏదో ఒక విధంగా రాబట్టేవారట. ఈ క్రమంలో ఓ సారి ప్రేమ్ కుమార్ కు డబ్బులు బాగా అవసరం అవ్వడంతో.. శోభన్ బాబును అడగడానికి మొహమాటపడ్డాడట. వెంటనే వేరే ప్లాన్ ఒకటి వేసి.. బాబుగారు.. నేను ఒకటి అడుగుతాను.. అది మీరు చెప్పలేకపోతే.. నాకు 100 రూపాయిలు ఇవ్వాలి అన్నాడట. శోభన్ బాబు సాధారణంగా ఇలాంటివి ఎంకరేజ్ చేయరు.. కానీ ప్రేమ్ కుమార్ దగ్గర మాత్రం ఇటుంటివి నడిచేవి.. ఆరోజు కూడా ఇలాంటిదేదో ఉందని అనుకుని, సరే అని శోభన్ బాబు బెట్ కు రెడీ అయ్యారు. వెంటనే ప్రేమ్ కుమార్ ''బుబా నభశో '' అంటే ఏంటో చెప్పడి అన్నారు. ఆయన ఆలోచించుకునేలోపే.. మీరు చెప్పలేకపోయారు. ఓడిపోయారు. శోభన్ బాబు పేరును తిప్పి చెప్పాను... అతే అని ఆయన దగ్గర వంద రూపాయలు వసూలు చేసుకున్నాడట. ప్రేమ్ కుమార్ ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టే ఇలా చేస ఉంటాడని శోభన్ బాబు కూడా అర్ధం చేసుకుని వంద రూపాయలు ఇచ్చారట.

44
ఇండస్ట్రీపై బుక్ రాసిన జయకుమార్

ఈ విషయాన్ని ఆ టైమ్ లో పనిచేసిన మరో అసిస్టెంట్ డైరెక్టర్ జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి ఓ బుక్ కూడా రాశారు. కె విశ్వనాథ్ దగ్గర పనిచేసిన జయకుమార్.. ఆతరువాత కాలంలో బాపు దగ్గర కూడా పనిచేశారు. శోభన్ బాబుతో స్నేహంగా ఉండే జయకుమార్.. అప్పట్లో జరిగిన విషయాలు పలు ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకున్నారు. ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని శోభన్ బాబు బాగా అభిమానించేవారట. అంతే కాదు ఆ వ్యక్తికి ప్రతీరోజు మధ్యహ్నం భోజనం కూడా ఇవ్వాలని.. తన థియేటర్ లో ఎంప్లైస్ కు శోభన్ బాబు ఆర్డర్ ఇచ్చాడని జయకుమార్ వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories