చిరంజీవి ప్రయోగాత్మకంగా కెరీర్ బిగినింగ్ లో ఓ చిత్రంలో నటించారు. ఆ సినిమా గురించి దాసరి మాట్లాడుతూ.. చిరంజీవి చేస్తే మేమంతా ఫాలో కావాలా అని అన్నారట. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అగ్ర స్థానానికి చేరుకున్నారు. చిరంజీవికి కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యేవి. కొందరు అగ్ర దర్శకులు కూడా చిరంజీవిని చిన్న చూపు చూసేవారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో జాతర అనే సినిమా తెరకెక్కించిన దర్శకుడు ధవళ సత్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
దేశాన్ని ఏలే నటుడివి అవుతావు
సత్యం మాట్లాడుతూ.. జాతర చిత్రాన్ని మేము అనుకున్న సమయానికే ప్రారంభించి ఉంటే అదే చిరంజీవి తొలి చిత్రం అయ్యేది అని అన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవితో నేను చెప్పాను. నువ్వు భవిష్యత్తులో దేశాన్ని ఏలే నటుడివి అవుతావు అని అన్నాను. అంత వద్దు అన్నా.. మీ నెక్స్ట్ మూవీలో 5 మంచి సీన్లు ఉండే పాత్ర ఇవ్వండి చాలు అని అడిగేవాడు. 5 సీన్లు కాదు.. సెన్సేషన్ క్రియేట్ చేసే హీరోవి అవుతావు చూడు అని చెప్పేవాడిని.
35
పాత్రలపై నడిచే సినిమా
జాతర సినిమా అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమని బాగా ఇబ్బంది పెట్టింది అని సత్యం అన్నారు. జాతర మూవీలో చిరంజీవి పేరుకే హీరో. హీరోయిన్ కూడా ఉండదు. విలన్ కూడా ఉండడు. సినిమా అంతా పాత్రల ఆధారంగానే ముందుకు వెళుతుంది. టాలీవుడ్ ఆ చిత్రం ఒక కొత్త ఒరవడికి కారణం అయింది. కమర్షియల్ సినిమాల్లో ఉండే రొటీన్ ఫార్ములా కథ ఉండదు.
దీనితో జాతర మూవీ గురించి తెలుసుకుని కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈ సినిమా సక్సెస్ అయితే హీరో ప్రాధాన్యత లేకుండా, కమర్షియల్ అంశాలు లేకుండా సినిమాలు వస్తాయా అనే చర్చ జరిగింది. దాసరి నారాయణ రావు గారు మా గురువు గారే. ఆయన కూడా నన్ను పిలిచి అడిగారు. ఏంటి చిరంజీవితో జాతర అనే కొత్త కథతో సినిమా చేస్తున్నావట. మీరు చేస్తే మేమంతా ఫాలో అయిపోవాలా అని అడిగారు. బహుశా ఇలాంటి సినిమాలు విజయం సాధించకూడదు అని వారంతా భావించి ఉంటారు.
55
రక్తం కారుతున్న నటించిన చిరు
జాతర మూవీ కోసం చిరంజీవి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఒక పొలంలో ఫైట్ సీన్ చిత్రీకరించాం. చిరంజీవి ఒళ్ళంతా బురదతో కష్టపడుతున్నాడు. కాలు పైభాగం నుంచి బాగా రక్తం కారుతోంది. మేమంతా భయపడ్డాం. పక్కనే ఉన్న రైతు అది జలగ అని చెప్పి దానిని తీసి పడేశాడు. చిరంజీవి కష్టపడే తత్వం, ఏదైనా చెబితే వెంటనే గ్రహించగలిగే కెపాసిటీని అప్పుడే చూసినట్లు సత్యం అన్నారు.