Allu Arjun: ఆ హీరోయిన్‌ పెళ్లి చేసుకుంటే అల్లు అర్జున్‌ హార్ట్ బ్రేక్‌.. బన్నీ ఆరాధించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Published : Apr 01, 2026, 01:37 PM IST

Allu Arjun: అల్లు అర్జున్‌ అమితంగా ఆరాధించే హీరోయిన్‌ ఎవరో తెలుసా? అయితే ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు తెగ బాధపడ్డాడట. హార్ట్ బ్రేక్‌ అయినంత పని అయ్యిందట. 

PREV
14
ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తోన్న అల్లు అర్జున్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇప్పుడు ఇండియాలోనే టాప్‌ స్టార్స్ లో ఒకరు. `పుష్ప 2`తో ఆయన బాక్సాఫీసుని ర్యాంపేజ్‌ ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అట్లీతో చేయబోతున్న సినిమా(ఏఏ22)తో అన్ని ఇండియన్‌ సినిమా రికార్డులను బ్రేక్‌ చేయాలని చూస్తున్నారు. దీన్ని భారీ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కించే పనిలో ఉన్నారు. అంతర్జాతీయ సినిమా స్థాయిలో దీన్ని రూపొందిస్తున్నారు. త్వరలో బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌, గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని తాజాగా నిర్మాత బన్నీవాసు తెలిపారు.

24
హీరోయిన్‌ పెళ్లితో బన్నీ హార్ట్ బ్రేక్‌

ఈ క్రమంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన ఒక క్రేజీ విషయం బయటకు వచ్చింది. ఆయన ఇప్పటి వరకు రివీల్‌ చేయని, ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని బయటపెట్టారు. ఒక హీరోయిన్‌పై క్రష్‌ని వెల్లడించారు. ఆమెని ఆయన ఎంతో ఆరాధించాడట. అయితే ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు బన్నీ హార్ట్ బ్రేక్‌ అయ్యిందట. అస్సలు తట్టుకోలేకపోయినట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు. క్రేజీ విషయాన్ని బయటపెట్టాడు ఐకాన్‌ స్టార్‌.

34
అల్లు అర్జున్‌ ఆరాధించిన హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌

చిన్నప్పట్నుంచి తాను ఆరాధించే హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉండేది మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌. ఆమె అంటే తెగ ఇష్టమట. పెద్ద క్రష్‌. తాను ఎంతో ఆరాధించే ఐశ్వర్య రాయ్‌ పెళ్లి చేసుకుంది. అప్పుడు చాలా బాధపడ్డాడట. ఆ విషయాన్ని బన్నీ చెబుతూ, `నాకు పెళ్లి అయినప్పుడు చాలా మంది అమ్మాయిలు బాధపడుతూ మెసేజ్‌లు, ఈమెయిల్‌ లు పంపించారు. అభిమాన తారలకు పెళ్లి అయితే ఉండే బాధ నాకూ తెలుసు. ఐశ్వర్యా రాయ్‌ పెళ్లి చేసుకున్నప్పుడు నేనూ అంతా బాధపడ్డాను` అని వెల్లడించారు అల్లు అర్జున్‌. రుద్రమదేవి సినిమా సమయంలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. ఐశ్వర్యా రాయ్‌.. హీరో అభిషేక్‌ బచ్చన్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

44
అల్లు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్న బన్నీ

అల్లు అర్జున్‌ ఏప్రిల్‌ 8న తన 44వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా ఈ విషయంలో వైరల్‌ గా మారింది. అల్లు అర్జున్‌.. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తమది ప్రేమ పెళ్లి కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లి అని ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ వెల్లడించారు. తను కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యిందని, చాలా రోజులుగా తెలుసు అని, క్లోజ్‌ అయ్యామని, ఫ్రెండ్స్ కూడా మీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పారని, కానీ అప్పటికే ఇంట్లో వాళ్లు పెళ్లి సెట్‌ చేసినట్టు తెలిపారు బన్నీ. తమది ప్రేమ పెళ్లి కాదని వెల్లడించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories