నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా ఇప్పటికీ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వరస హిట్లతో దూసుకుపోతున్న ఆయన తన కెరీర్ లో ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో చెన్నకేశవ రెడ్డి కూడా ఒకటి.ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. బాలయ్య ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చే చిత్రాల్లో ఇది కూడా ఉంటుంది.
వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయర్ రూల్ చేశారు. రెండు పాత్రల్లోనూ ఆయన అదరగొట్టారు. అయితే, ఈ సినిమాలో తండ్రి పాత్ర చెన్నకేశవ రెడ్డికి భార్యగా, కొడుకు భరత్ రెడ్డికి తల్లిగా టుబు పవర్ ఫుల్ రూల్ లో నటించి మెప్పించారు. కానీ, ఈ పాత్ర వెనక ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.