వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి పూనమ్ పాండే, ఇప్పుడు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. అసలు పూనమ్ నిజంగానే గర్భవతా? లేక ఇది కూడా మరో పబ్లిసిటీ స్టంటా?
వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి పూనమ్ పాండే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలతో వైరల్.. చేస్తోంది. బేబీ బంప్‌తో ఉన్న రెండు ఫోటోలను ఆమె షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఇది నిజమేనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
25
పూనమ్ పాండే గర్భవతి..?
సోషల్ మీడియాలో పూనమ్ పాండే రెండు ఫోటోలతో ఒక పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె బేబీ బంప్‌తో కనిపిస్తోంది. ఈ ఫోటోల్లో ఆమె బరువు పెరిగినట్లు స్పష్టంగా ఉంది. అయితే, ఈ సంతోషకరమైన క్షణాలను పంచుకున్నా, ఇది నిజమా కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది.
35
ఏప్రిల్ ఫూల్ చేసిన పూనమ్
పూనమ్ పాండే బేబీ బంప్ పోస్ట్‌ను చాలామంది అనుమానంగా చూస్తున్నారు. ఏప్రిల్ 1 దగ్గర పడుతుండటంతో, ఆమె మళ్లీ జనాలను ఫూల్స్ చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ ఫూల్ కోసం చేస్తున్న జిమ్మిక్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
2024లో గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన ప్రచారంలో భాగంగా పూనమ్ పాండే చనిపోయిందని అబద్ధం చెప్పి పెద్ద దుమారమే రేపింది. ఆమె మేనేజర్ ఈ పోస్ట్ పెట్టినట్లు నమ్మించి, విపరీతమైన పబ్లిసిటీ పొందింది. అందుకే ఇప్పుడు ఆమె ఎంత సీరియస్ విషయం చెప్పినా జనం నమ్మట్లేదు.
55
పూనమ్ పాండేపై కేసులు..
చనిపోయానని అబద్ధం చెప్పినందుకు పూనమ్ పాండేపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇది అతి ప్రచారం అని చాలామంది విమర్శించారు. ఇదే కారణంతో, ఇప్పుడు ఆమె గర్భవతి అని ఫోటోలు పెట్టినా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు.