Sudha Kongara about Sivakarthikeyans Parasakthi Movie: `ఆంధ్ర అందగాడు` సినిమాతో దర్శకురాలిగా తెలుగు తెరకు పరిచయమైన సుధా కొంగర ఆ తర్వాత `ద్రోహి`, `ఇరుది సుట్రు`, `సూరరై పోట్రు`(ఆకాశమే నీ హద్దురా) వంటి హిట్ సినిమాలు తీశారు. ఇప్పుడు `పరాశక్తి` సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరో. రవి మోహన్, అథర్వ, దేవ్ రామ్‌నాథ్ నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. డాన్ పిక్చర్స్ నిర్మాణంలో, జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.