టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక ఆట మొదలు పెట్టాడు. పాన్ఇండియా స్టార్ గా బన్నీ కొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడు. పుష్ప2 సినిమాతో రికార్డ్ ల మోత మోగించేశాడు అల్లు అర్జున్. ఇక నెక్ట్స్ సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు. పుష్ప2 సినిమా తో జరిగిన రచ్చ వల్ల ఈసినిమా సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాంతో ఈ చికాకుల నుంచి కాస్త దూరంగా ఉండటం కోసం సినిమాలకు షార్ట్ గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read: దంగల్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప2, అల్లుఅర్జున్ ప్లాన్ మామూలుగా లేదుగా.
పుష్ప మూవీ రిలీజ్ తరువాత అల్లు అర్జున్ కు నార్త్ లో భారీగా క్రేజ్ ఏర్పడిననేపథ్యంలో.. అప్పట్లోనే బన్సాలీ బన్నీతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నం చేశాడని సమాచారం. అయితే పుష్ప 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం. బాహుబలి 2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేస్తే.. 1830 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించడంతో.. అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియాలో ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాకు నార్త్ నుంచే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.
Also Read: హీరోలకంటే హ్యాండ్సమ్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్, అనిల్ రావిపూడి నుంచి వశిష్ట వరకూ...
రెండు తెలుగురాష్ట్రాల కంటే కూడా నార్త్ కలెక్షన్స్ ఎక్కువ. ఇప్పటికీ ఈసినిమా అక్కడ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇక దంగల్ కలెక్షన్స్ ను క్రాస్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు పుష్ప2 టీమ్. ఈక్రమంలో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో పెరిగిని క్రేజ్ ను క్యాచ్ చేసి.. అద్భుమైన సినిమా చేయాలని చూస్తున్నారట సంజయ్ లీలా భన్సాలీ. ఈసినిమా కోసమే అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. నార్త్ లోమరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ లలో బన్నీ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.
సో ఈ దెబ్బతో బన్నీ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వడం ఖాయం అంటున్నారు. భన్సాలీ బన్నీ సినిమా చేసి..అది బ్లాక్ బస్టర్ అయితే.. అల్లు అర్జున్ ను అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఇక పుష్ప3 విషయానికి వస్తే.. పుష్ప2 వివాదం వల్ల పుష్ప3కి కాస్త గ్యాప్ ఇవ్వాలి అనుకున్నారు బన్నీ. అందుకే ఆ లుక్ నుంచి కూడా బయటకు వచ్చాడు. షార్ట్ హెయిర్, షార్ట్ గెడ్డంతో కొత్తగా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్.
ఇక ఈలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు సందీప్ రెడ్డి వంగా సినిమాను కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. త్రివిక్రమ్ సినిమా ఈ మార్చ్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో బాలీవుడ్ లో బన్నీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి. ఒక వేళ టాలీవుడ్ ను వదిలి.. ముంబయ్ లో సెటిల్ అయినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదేమో.. బాలీవుడ్ అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది అల్లు అర్జున్ కు.