యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. 45 ఏళ్ళు వచ్చినా ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటి వరకు లెక్కలేన్నని రూమర్స్ వచ్చాయి. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాడు అని అప్పట్లో ప్రచారం జరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఐదు పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ పెళ్లి మాత్రం జరగలేదు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ప్రభాస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో గోపీచంద్, బాలయ్య కలసి ప్రభాస్ ని సరదాగా ఆటపట్టించారు. ఆ టైంలో ప్రభాస్ కి రాంచరణ్ ఫోన్ చేసి ఫన్నీగా మాట్లాడిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాంచరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. రాంచరణ్ ని బాలయ్య ప్రభాస్ గురించి ప్రశ్నించారు.
Ram Charan
ప్రభాస్ గురించి చర్చ జరిగినా ప్రతి సారీ వినిపించే మొదటి ప్రశ్న అతడి పెళ్లి ఎప్పుడు అని. బాగా క్లోజ్ అయితే తప్ప వేరే వాళ్ళ పెళ్లి విషయాల గురించి ఇతర హీరోలు స్పందించరు. ప్రభాస్ కి చరణ్ బాగా క్లోజ్ కాబట్టి సంచలన మ్యాటర్ ని లీక్ చేశారు. ప్రభాస్ అతి త్వరలో బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు రాంచరణ్ రివీల్ చేశారు. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది అంటూ రాంచరణ్ మైండ్ బ్లోయింగ్ విషయం చెప్పేశాడు.
అమ్మాయి వివరాలు కూడా రాంచరణ్ లీక్ చేశారు. తూర్పు గోదావరి జిలా గణపవరంకి చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్లు రాంచరణ్ తెలిపారు. ఈ ఎపిసోడ్ జనవరి 14న ప్రసారం కానుంది. ప్రభాస్ పెళ్లి గురించి రాంచరణ్ ఇంకా ఎలాంటి విషయాలు లీక్ చేశాడో తెలియాలంటే అన్ స్టాపబుల్ షో చూడాల్సిందే.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్, నాగ చైతన్య, నాని ఇలా అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ప్రభాస్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. గతంలో ప్రభాస్, అనుష్క గురించి ఎలాంటి రూమర్స్ వచ్చాయో తెలిసిందే. మొత్తంగా ప్రభాస్ పెళ్లి వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది.