ప్రభాస్‌తో సుకుమార్‌ చేయాల్సిన మూవీ ఏంటో తెలుసా? డార్లింగ్ ది కరెక్ట్ జడ్జ్ మెంటేనా?

First Published | Jan 11, 2025, 9:34 AM IST

`పుష్ప 2`తో సంచలనాలు సృష్టించిన సుకుమార్‌.. ప్రభాస్‌తో సినిమా చేయలేదు. కానీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రావాల్సి ఉంది. మరి అదేంటి? ఎలా సెట్‌ కాలేదనేది చూస్తే. 
 

దర్శకుడు సుకుమార్‌ తగ్గి సినిమాలు చేస్తే మేం ఎవ్వరం ఆయన ముందు నిలబడం అని దర్శకుడు రాజమౌళి ఓ ఈవెంట్‌లో చెప్పారు. సుకుమార్‌ టాలెంట్‌ గురించి అప్పట్లోనే వివరించారు జక్కన్న. ఇంకా చెప్పాలంటే సుకుమార్‌లోని క్రియేటివ్‌ జీనియస్ ని ఆయన ముందే చూశాడు.

అదే విషయం పదేళ్ల క్రితమే చెప్పాడు. రాజమౌళి చెప్పినట్టుగానే ఆకాశం విడిచి నేలమీదకు వచ్చాడు సుకుమార్. సంచలనాలు క్రియేట్‌ చేస్తున్నారు. 
 

`నాన్నకు ప్రేమతో` వరకు సుకుమార్‌ సినిమాలు హైలీ ఇంటలిజెంట్ గా ఉండేవి. ఆయన సినిమాలు అర్థం కావాలంటే మినిమమ్‌ బీ టెక్ చేసి ఉండాలని, లేదంటే మ్యాథ్స్ లో జెమ్స్ అయి ఉండాలి అనేట్టుగా ఉండేవి. కానీ `రంగస్థలం` నుంచి ఆయన తగ్గారు. లెక్కలు పక్కన పెట్టి రియాలిటీ చూపించారు.

రామ్‌ చరణ్‌తో చేసిన ఈ మూవీ అప్పట్లో నాన్ బాహుబలి 2 రికార్డులను బ్రేక్‌ చేసింది. సుకుమార్‌ అంటే ఏంటో? అప్పుడు అర్థమైంది. ఇప్పుడు `పుష్ప 2` చూశాక, అది క్రియేట్‌ చేస్తున్న సంచలనాలు చూశాక రాజమౌళి చెప్పింది నిజమే అని ఒప్పుకోక మానరు. 
 


అలాంటి సుకుమార్‌ ఇప్పటి వరకు బన్నీ, చరణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, నాగచైతన్య, రామ్‌లతో సినిమాలు చేశారు. కానీ ప్రభాస్‌తో ఇప్పటి వరకు మూవీ చేయలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. సుకుమార్‌ మాత్రం ప్రభాస్‌తో సినిమా చేయాలనుకున్నారు. కానీ డార్లింగే నో చెప్పాడు. మరి ఆ సినిమా ఏంటి? అది ఎలా మిస్‌ అయ్యిందనేది చూస్తే. 

సుకుమార్‌ మొదట సినిమా చేయాలనుకున్నది ప్రభాస్‌తోనే. ఆయన మొదటి సినిమా `ఆర్య` కథని ప్రభాస్‌కే చెప్పాడట. ప్రభాస్‌ ఆ టైమ్‌లో హీరోగా బాగానే ఎస్టాబ్లిష్ అయ్యాడు. మాస్‌ ఇమేజ్‌ ఉంది. ఈ క్రమంలో సుకుమార్‌ `ఆర్య` కథని చెప్పాడు. అది విన్న డార్లింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

ఈ కథ తనకు సెట్‌ కాదన్నారు. కానీ సుకుమార్‌ కన్విన్స్ చేయాలని ప్రయత్నించాడు. ప్రభాస్‌తో చేస్తే వేరేలెవల్ కి వెళ్తుందనేది డైరెక్టర్‌ నమ్మకం. కానీ ప్రభాస్‌కి మాత్రం తాను ఇలాంటి క్రేజీ లవ్‌ స్టోరీలో సెట్‌ కాదు, తనకు సూట్‌ కాదు అని చెప్పేశాడట. 
 

Prabhas real story upcoming film updates

అలా ప్రభాస్‌తో సుకుమార్‌ చేయాలనుకున్న సినిమా సెట్‌ కాలేదు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ప్రభాస్‌ కోసం ఆయన కథలు రాయలేదు. మళ్లీ ఎప్పుడూ వీరిద్దరు కలిసి చేసే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇప్పటి వరకు సినిమా పడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్‌తో సినిమా చేయడం చాలా కష్టం.

మరో నాలుగైదేళ్లు పడుతుంది. సుకుమార్‌ మాత్రం ప్రభాస్‌ తో సినిమా చేసే రేంజ్‌కి వచ్చాడు. మరి మున్ముందైనా ఈ కాంబో సెట్‌ అవుతుందా అనేది చూడాలి. సెట్‌ అయితే మాత్రం `పుష్ప 2` ని మించిన మూవీ కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ప్రభాస్‌ నో చెప్పిన కథని అల్లు అర్జున్‌కి చెప్పాడు సుకుమార్‌.మధ్యలో నితిన్‌ వద్దకు కూడా వెళ్లింది. ఆయన కూడా నో చెప్పారు. ఆతర్వాత ప్రసాద్‌ ల్యాబ్‌లో అల్లు అర్జున్‌ని చూశాడు సుకుమార్. నాకు కావాల్సిన హీరో దొరికాదు అని ఫిక్స్ అయ్యాడు. బన్నీని పట్టుకుని ఆయనకు ఈ కత చెప్పారు. ఆయనకు విపరీతంగా నచ్చింది.

బన్నీ ఆ టైమ్‌లో ఇలాంటి క్రేజీ స్టోరీనే చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ మూవీ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యారు. అటు దిల్‌ రాజు, ఇటు బన్నీ .. అల్లు అరవింద్, మెగాస్టార్ ని ఒప్పించారు. మొత్తానికి సినిమా చేశారు. అది అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌. యువతని పిచ్చెక్కింది. ప్రభాస్‌ చెప్పింది నిజమే అనిపించారు.  

అంతే సుకుమార్‌ ఇక దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉన్నారు. మొన్న `పుష్ప 2` ఇండియన్‌ సినిమా కలెక్షన్లని షేక్‌ చేశారు. ఇండియాలో అత్యధిక వసూళ్లరాబట్టిన చిత్రంగా `పుష్ప2`ని నిలిపారు. ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. నేడు(జనవరి 11) సుకుమార్‌ బర్త్ డే కావడం విశేషం. 

read more: రామ్‌ చరణ్‌కి అన్యాయం చేసిన శంకర్‌, `గేమ్‌ ఛేంజర్‌` విషయంలో ఆయన చేసిన మిస్టేక్‌ ఇదే?

also read: `అఖండ 2` తర్వాత నేనేంటో చూపిస్తా.. బాలకృష్ణ ఊరమాస్‌ కామెంట్స్.. నన్ను చూసి నాకే పొగరు
 

Latest Videos

click me!