పవన్ కళ్యాణ్ తో గొడవ పై బాలయ్యకు క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్, ఇక మెగా వార్ కు పుల్ స్టాప్ పడినట్టేనా..?

First Published | Oct 11, 2024, 5:10 PM IST

మెగా ఫ్యామిలీలో లుకలుకలు.. అల్లు అర్జున్ తో మెగా కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడట. అల్లు అర్జున్. బాలయ్యతో అసలు విషయాన్ని ఓపెన్ అయ్యాడని టాక్. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

మెగా ఫ్యామిలీలో గత కొంత కాలంగా  జరుగుతున్న లుకలుకల సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీ కోల్డ్ వార్.. ఎంత వరకూ వెళ్ళిందో కూడా తెలిసిందే. కాని ఇంత జరిగినా.. ఎవరు బయటపడి మాట్లాడింది లేదు.

ఫ్యాన్స్ మధ్య, సోషల్ మీడియా వార్ జరగడంతో పాటు రాజకీయ పార్టీలు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవడమే కాని.. అటు అల్లు అర్జున్ కాని.. ఇటు పవన్ కాని.. డైరెక్ట్ గా ఓపెన్ అయ్యింది లేదు. 

Also Read: వెండితెర బామ్మ నిర్మలమ్మ మనవడు కూడా నటుడే అని మీకు తెలుసా..?

కాని ఇండైరెక్ట గా పవన్ - బన్ని వేసుకుంటున్న సెటైర్లు మాత్రం అందరికి అర్ధం అవుతున్నాయి. ఇక ఈ విషయంలో ఎవరు ముందడుగు వేసి.. క్లారిటీ ఇస్తారు.. ఎవరు సర్దుకుపోతారు అన్న విషయం ఉత్కంఠగా మారింది.

ఈక్రమంలోనే ఈ విషయంలో అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్లారిటీ ఏదో మెగా ఫ్యామిలీకి ఇవ్వలేదు. బాలయ్యకు ఇచ్చాడట. 

Also Read: చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?


పవన్ తో గొడవలు నిజమెంత, అసలు ఏం జరుగుతుంది.. మీడియాలో వచ్చేదానిలో నిజం ఎంత.. నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చింది లాంటి విషయాలలో ఆయన క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇదంతా బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో జరిగిందట. త్వరలో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 3 ప్రసారం కాబోతోంది. 

Also Read:నితిన్ దిల్ సినిమాలో నటించిన ఈ 5 గురు నటులు ఎలా చనిపోయారో తెలుసా..?

ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈకార్యక్రమం గత రెండు సీజన్లను బాలయ్య హోస్టింగ్ లో అదరగొట్టాడు.

మొదటి సీజన్ నుంచి బాలయ్య యాంకరింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అంతే కాదు మహేష్, ప్రభాస్, రవితేజ, లాంటి స్టార్స్ తో పాటు.. చిన్నా పెద్ద  హీరోలు, పొలిటిక్ లీడర్స్ కూడా ఇప్పటికే అన్ స్టాపబుల్ లో సందడి చేశారు. 

Also Read:బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Rajamouli

ఇక మూడో సీజన్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గాస్టార్ట్ చేయాలని అనుకున్నారట. ఇక షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇంటర్వ్యూలో బన్నీ చాలా విషయాలు శేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కోల్డ్ వార్.. తాను నంద్యాల ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. అసలు రెండు కుటుంబాల మధ్య ఎలాంటిసబంధాలు ఉన్నాయి అనే విషయంలో బన్నీ క్లారిటీ ఇచ్చాడట. 

గత నాలుగు నెలల నుంచి  ఈ మెగా వార్ ఫ్యాన్స్ లో చిరాకు తెప్పిస్తోంది. మెగా ఫ్యాన్స్ కూడా కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. దాంతో కాస్త అల్లు అర్జున్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి.. ఎక్స్ ప్లెనేషన్ ఇస్తే.. మెగా వార్ ఆగిపోయి.. అంతా హ్యాపీగా ఉండొచ్చు అని భావిస్తున్నారు. మరి ఈ ఎపిసోడ టెలికాస్ట్ అయిన తరువాత కాని అసలు విషయం బయటపడదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Latest Videos

click me!